AP News: కొడితే ఏనుగు కుంభస్థలమే కొట్టాలని భావించారు.. ప్లాన్ సక్సెస్.. ఆ తరువాత ట్విస్ట్ అదుర్స్..!

Andhra Pradesh News: బైక్ కాదు, ఆటో కాదు, కారు కాదు.. ఏకంగా జేసిబినే కొట్టేశారు ఆ దొంగలిద్దరూ. నెల్లూరుకు చెందిన మల్లికార్జున రావు, నాగరాజు లు గుంటూరు వచ్చారు.

AP News: కొడితే ఏనుగు కుంభస్థలమే కొట్టాలని భావించారు.. ప్లాన్ సక్సెస్.. ఆ తరువాత ట్విస్ట్ అదుర్స్..!
Jcb
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 28, 2022 | 7:12 AM

Andhra Pradesh News: బైక్ కాదు, ఆటో కాదు, కారు కాదు.. ఏకంగా జేసిబినే కొట్టేశారు ఆ దొంగలిద్దరూ. నెల్లూరుకు చెందిన మల్లికార్జున రావు, నాగరాజు లు గుంటూరు వచ్చారు. ఏదైనా దొంగతనం చేయటం కోసం ప్రయత్నించారు. ఈ క్రమంలో చేబ్రోలు మండలం నారా కోడూరు చేరుకున్నారు. రాత్రి సమయంలో సెంటర్ లో పార్క్ చేసి ఉన్న జేసిబి కనిపించింది. దాన్ని దొంగలించాలని నిర్ణయించుకున్నారు. అయితే జేసిబికి తాళం వేసి ఉంది. తమ వద్ద నున్న తాళాలతో ట్రై చేస్తే జేసిబి తాళం వచ్చింది. ఇంకేముంది ఆనందంతో జేసిబీ ఎక్కి చిన్నగా స్టార్ట్ చేసి దొంగలించుకుపోయారు.

తెల్లవారి సెంటర్ కు వచ్చి చూసే సరికి జేసిబి కనిపించలేదు. దీంతో యజమాని సాంబశివరావు చేబ్రోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బైకో, ఆటోనో అయితే నింపాదిగా స్పందించే పోలీసులు జేసిబి పోయిందనే సరికి అప్రమత్తమయ్యారు. సాంకేతిక ఆధారాలు సేకరించారు. రాత్రి సమయంలో టవర్ లోకేషన్ ఆధారంగా కాల్ డేటా సేకరించారు. ఆతర్వాత సిసి కెమెరా విజువల్స్ తీసుకున్నారు. పెట్రోల్ బంక్ లో వద్ద విచారించారు. చివరికి జేసిబి నెల్లూరు జిల్లా చేరిందని గ్రహించారు. కాల్ డేటా ఆధారంగా దొంగలిద్దరిని పట్టుకొని జేసిబిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

-టి నాగరాజు, టివి9 తెలుగు, గుంటూరు

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..