AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: రైల్వే ప్రాజెక్టులు ఇచ్చే ప్రసక్తే లేదు.. పార్లమెంట్ లో తేల్చి చెప్పిన కేంద్ర మంత్రి

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు రైల్వే ప్రాజెక్టులు ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ పార్లమెంట్ వేదికగా వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడమే ఇందుకు కారణమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో...

Andhra Pradesh: రైల్వే ప్రాజెక్టులు ఇచ్చే ప్రసక్తే లేదు.. పార్లమెంట్ లో తేల్చి చెప్పిన కేంద్ర మంత్రి
Ahswani Vaishnav
Ganesh Mudavath
|

Updated on: Jul 27, 2022 | 9:53 PM

Share

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు రైల్వే ప్రాజెక్టులు ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ పార్లమెంట్ వేదికగా వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడమే ఇందుకు కారణమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం రూ.70 వేల కోట్లు విలువైన రైల్వే పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఏపీ రైల్వే ప్రాజెక్టుల విషయంలో వైసీపీ (YCP) ప్రభుత్వం సహకరించడం లేదని చెప్పారు. వైసీపీ ఎంపీ వ‌ల్లభ‌నేని బాల‌శౌరి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. రైల్వే ప్రాజెక్టులు కావాలని కేంద్రాన్ని కోరుతున్న ఎంపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని సూచించారు. కేంద్రానికి సహకరించేలా చేస్తే ప్రస్తుతం కొన‌సాగుతున్న పనులయినా త్వరగా పూర్తవుతాయన్నారు. ఆ పనులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వాటాగా రూ.1,798 కోట్లు ఇవ్వాల్సి ఉంద‌ని, ఇలాంటి ప‌రిస్థితుల్లో కొత్త రైల్వే ప్రాజెక్టుల‌ు ప్రక‌టించ‌డం సాధ్యం కాద‌ని తేల్చి చెప్పేశారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి పనులు మూడేళ్లుగా ఆగిపోయాయి. ప్రభుత్వం తమ వాటా చెల్లించకపోవడంతో ముందుకు పడటం లేదన్నది కేంద్ర మంత్రి మాట.

ఆంధ్రప్రదేశ్ లో చాలావరకు రైల్వే ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి. వాటికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కేటాయించకపోవడంతో పనుల్లో పురోగతి లేదు. వాటిని కేంద్రం సాయంతోనే పూర్తి చేయాలనుకుంటున్న వైసీపీకి ప్రస్తుతం కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానం పిడుగుపాటులా మారింది. రైల్వే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సిందేనని రైల్వేమంత్రి కుండబద్ధలు కొట్టారు.