Andhra Pradesh: మానవత్వాన్ని చాటిన వరదయ్యపాలెం పోలీసులు.. అంబులెన్స్‌లా మారిన..!

Andhra Pradesh: తిరుపతి జిల్లా పరిధిలోని వరదయ్యపాలెం ఎస్సై నాగార్జున రెడ్డి, అతని బృందం మరో సారి తమ మానవత్వాన్ని చాటుకున్నారు..

Andhra Pradesh: మానవత్వాన్ని చాటిన వరదయ్యపాలెం పోలీసులు.. అంబులెన్స్‌లా మారిన..!
Police
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 28, 2022 | 7:19 AM

Andhra Pradesh: తిరుపతి జిల్లా పరిధిలోని వరదయ్యపాలెం ఎస్సై నాగార్జున రెడ్డి, అతని బృందం మరో సారి తమ మానవత్వాన్ని చాటుకున్నారు.. బుధవారం మండల పరిధిలోని కడూరు క్రాస్ వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న ప్రమాదంలో తాగేలి గ్రామానికి చెందిన సీనయ్య, చెన్నైకి చెందిన నందిని ఇద్దరు గాయాలుపాలై తీవ్ర రక్తస్రావంతో రోడ్డుపై ఆర్తనాదాలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఘటనా స్థలానికి సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తున్న ఎస్ఐ, సిబ్బంది విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన స్పందించారు. గాయాలు పాలైన క్షతగాత్రులును వెంటనే పోలీస్ ‘జీపు’లో తీసుకొని శ్రీ సిటీలోనే కావేరి ఆసుపత్రికి తరలించారు.

అత్యవసర వాహనాలు వచ్చేలోపు క్షతగాత్రులు అపస్మారక స్థితిలోకి వెళ్లే ప్రమాదం నెలకొన్న తరుణంలో మానవతా దృక్పథంతో స్పందించి పోలీసుజీపులో వాహన తనిఖీలను ఆపివేసి మరి తీసుకెళ్లి చికిత్స అందించడం పై బాధిత కుటుంబ సభ్యులతో పాటు మండల ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు, ప్రమాదం జరిగిన తరుణంలో అంబులెన్సులు, అత్యవసర వాహనాలు వచ్చే వరకు వేచి ఉండకుండా తమ వాహనాలలో తీసుకెళ్లి చికిత్సలు అందించడం, బాధితుల ప్రాణాలు కాపాడటమేనని ప్రశంసిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..