Tirumala: శ్రీవారి కానుకలు వేలం.. వాచీలు, మొబైల్స్‌కి రూ. లక్షల్లో ఆదాయం..

హుండీలో కానుకలుగా వచ్చే నగదు, బంగారు, బియ్యం, వస్త్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఇలా పలు రకాల కానుకలను వేరుచేసి వేలం వేస్తున్న టిటిడి శ్రీవారి ఆదాయంగా పరిగణిస్తోంది. తిరుమల వెంకన్న ఆలయంలోకి అనుమతి లేని మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ వాచీలతో వచ్చే భక్తులను తనిఖీ చేసి స్వాధీనం చేసుకునే వస్తువులు శ్రీవారి హుండీకి చేరుతుండగా వాటిని కూడా...

Tirumala: శ్రీవారి కానుకలు వేలం.. వాచీలు, మొబైల్స్‌కి రూ. లక్షల్లో ఆదాయం..
స్వామివారిని దర్శించుకోకుండా లడ్డూల కొరకు నేరుగా లడ్డూ కౌంటర్లకు వెళ్ళే భక్తులకు ఆధార్ కార్డు ద్వారా రోజువారి రెండు లడ్డూలు ఇవ్వనున్నట్లు తెలిపారు. టీటీడీ ప్రతిరోజు 3.5 లక్షల లడ్డూలను భక్తులకు విక్రయిస్తున్నదని, ఇందులో 2.5 లక్షల లడ్డూలు మాత్రమే భక్తులకు చేరుతున్నాయని, మిగిలిన లక్ష లడ్డూలు దర్శనం టోకెన్లు లేనివారు కొనుగోలు చేస్తున్నారన్నారు.
Follow us

| Edited By: Narender Vaitla

Updated on: Jun 24, 2024 | 8:16 PM

తిరుమల వెంకన్నకు భక్తులు వివిధ రూపాల్లో మొక్కులు చెల్లిస్తారు. ఆపదమొక్కుల స్వామికి కానుకలు సమర్పిస్తారు. ఇలా వడ్డికాసుల వాడికి కానుకలు సమర్పించే భక్తులు నిలువు దోపిడీ మొక్కును చెల్లిస్తారు. ముడుపులు కట్టి హుండీ లో కానుకలు సమర్పిస్తుంటారు. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో నిండుతున్న హుండీ కానుకలను పరకామణిలో లెక్కిస్తున్న టీటీడీ అందులో వచ్చే వస్తువులను పలు రకాలుగా వెంకన్న ఖాతాకు జమ చేస్తోంది.

హుండీలో కానుకలుగా వచ్చే నగదు, బంగారు, బియ్యం, వస్త్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఇలా పలు రకాల కానుకలను వేరుచేసి వేలం వేస్తున్న టిటిడి శ్రీవారి ఆదాయంగా పరిగణిస్తోంది. తిరుమల వెంకన్న ఆలయంలోకి అనుమతి లేని మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ వాచీలతో వచ్చే భక్తులను తనిఖీ చేసి స్వాధీనం చేసుకునే వస్తువులు శ్రీవారి హుండీకి చేరుతుండగా వాటిని కూడా టీటీడీ వేలం వేసి హుండీ ఆదాయంగా పరిగణిస్తుంది. స్వామివారి దర్శనానికి వెళ్లే ముందు మొబైల్స్ డిపాజిట్ చేసి తిరిగి తీసుకెళ్లకుండా వెళ్లే భక్తుల ఎలక్ట్రానిక్ గూడ్స్, మొబైల్స్ లను వేలం వేసేందుకు ట్రెజరీలో డిపాజిట్ చేస్తున్న టిటిడి ఈ మేరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆన్ లైన్ వేలం ప్రక్రియను నిర్వహిస్తోంది.

వేలంలో పాల్గొనే కొనుగోలుదారులు కానుకలను నేరుగా పరిశీలించుకునే అవకాశాన్ని కూడా టీటీడీ కల్పిస్తోంది. ఈ మేరకు కొనుగోలు పోర్టర్ లో తమ పేర్లను నమోదు చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తోంది. ఇలా హుండీ కానుకలుగా వచ్చే వాచీలు, మొబైల్ ఫోన్లను మూడు నెలలకు ఒకసారి వేలం వేస్తున్న టీటీడీ ఈ మేరకు ఈ-ఆక్షన్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది మార్చి 13న వేలం నిర్వహించిన టిటిడి 50 లాట్స్ గా విభజించి మొబైల్ ఫోన్లు, వాచీలను ఈ-వేలం నిర్వహించింది.

ఈ మేరకు కొనుగోలు పోర్టర్ లో ఆన్ లైన్ రిజిస్టర్ చేసుకున్న వారు బిడ్డింగ్ లో పాల్గొనగా 12 లాట్స్ లో మొబైల్ ఫోన్లు, వాచీలు సేల్స్ అయ్యాయి. ఈ మేరకు రూ. 8.11 లక్షల ఆదాయం టిటిడికి వచ్చింది. ఇక మిగిలిపోయిన మరో 38 లాట్స్ కు ఈ రోజు ఈ-వేలం నిర్వహించిన టిటిడి మార్కెటింగ్ విభాగం అధికారులు 14 లాట్స్ లోని 493 వాచీలు, 24 లాట్స్ లోని 258 మొబైల్ ఫోన్స్ అమ్మకానికి పెట్టింది. దాదాపు రూ. 42 లక్షల ఆదాయం వచ్చేలా శ్రీవారికి కానుకగా వచ్చిన వాచీలు మొబైల్ ఫోన్లను విక్రయించేందుకు టీటీడీ వేలం నిర్వహించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

రాహు, కేతు దోషమా..! 18 శనివారాలు ఈ పరిహాలు చేసి చూడండి..
రాహు, కేతు దోషమా..! 18 శనివారాలు ఈ పరిహాలు చేసి చూడండి..
దమ్ముంటే సీబీఐ విచారణ చేయించాలి.. ఏపీ సర్కార్‌కు బొత్స సవాల్
దమ్ముంటే సీబీఐ విచారణ చేయించాలి.. ఏపీ సర్కార్‌కు బొత్స సవాల్
పెట్టుబడిదారులకు అలెర్ట్.. అక్టోబర్ నుంచి కీలక నియమాల మార్పు
పెట్టుబడిదారులకు అలెర్ట్.. అక్టోబర్ నుంచి కీలక నియమాల మార్పు
పండగకు ముందు సామాన్యులకు షాక్‌.. భారీగా పెరిగిన వంట నూనె ధరలు
పండగకు ముందు సామాన్యులకు షాక్‌.. భారీగా పెరిగిన వంట నూనె ధరలు
రెండోసారి తండ్రైన జబర్దస్త్ వినోద్.. ఫ్యామిలీ వీడియో వైరల్
రెండోసారి తండ్రైన జబర్దస్త్ వినోద్.. ఫ్యామిలీ వీడియో వైరల్
లంచావతారులను ఏసీబీ అధికారులు ఎలా ట్రాప్ చేస్తారు..?
లంచావతారులను ఏసీబీ అధికారులు ఎలా ట్రాప్ చేస్తారు..?
వెరైటీ కోసం ఐస్ క్రీమ్‌ని ఇలా కూడా చేస్తారా! కేసు పెట్టమంటున్న..
వెరైటీ కోసం ఐస్ క్రీమ్‌ని ఇలా కూడా చేస్తారా! కేసు పెట్టమంటున్న..
త్వరలో స్టాక్ మార్కెట్‌లో ఐపీవో జాతర..!
త్వరలో స్టాక్ మార్కెట్‌లో ఐపీవో జాతర..!
చేపలు తినడం వల్ల 5 అద్భుతమైన ప్రయోజనాలు.. అవేంటో తెలిస్తే..
చేపలు తినడం వల్ల 5 అద్భుతమైన ప్రయోజనాలు.. అవేంటో తెలిస్తే..
తొక్కే కదా అని చిన్న చూపు చూసేరు.. ఉల్లి తొక్కతో లాభాలెన్నో
తొక్కే కదా అని చిన్న చూపు చూసేరు.. ఉల్లి తొక్కతో లాభాలెన్నో