AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో దేవుడా ఎంతపనైంది.. పిల్లలు టెన్త్ పాస్ అయ్యారని దైవ దర్శనానికి వెళ్లారు.. చివరకు..

తమ చిన్నారులు పదో తరగతిలో పాస్ అయ్యారు.. దీంతో తల్లిదండ్రులు అవధులు లేకుండా పోయింది.. మంచి మార్కులతో తమ చిన్నారులు పాస్ అయ్యారని సంబరపడ్డారు.. దీంతో నంద్యాల జిల్లా శ్రీశైలంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు పయనమయ్యారు..

అయ్యో దేవుడా ఎంతపనైంది.. పిల్లలు టెన్త్ పాస్ అయ్యారని దైవ దర్శనానికి వెళ్లారు.. చివరకు..
Road Accident
J Y Nagi Reddy
| Edited By: Shaik Madar Saheb|

Updated on: May 03, 2025 | 12:00 PM

Share

తమ చిన్నారులు పదో తరగతిలో పాస్ అయ్యారు.. దీంతో తల్లిదండ్రులు అవధులు లేకుండా పోయింది.. మంచి మార్కులతో తమ చిన్నారులు పాస్ అయ్యారని సంబరపడ్డారు.. దీంతో నంద్యాల జిల్లా శ్రీశైలంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు పయనమయ్యారు.. ఆలయానికి వెళ్లి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం తిరుగు పయనమయ్యారు.. ఇంతలోనే ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.. ఈ ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. మరో 13 మందికి పైగా గాయపడ్డారు.. ఈ ఘటన నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు మండలం బైర్లూటి సమీపంలో జరిగింది. శ్రీశైలం దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ఆటో బోల్తా పడి అక్కడికక్కడే నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మరొకరు చికిత్స పొందుతూ మరణించారు.

వివరాల ప్రకారం.

కర్నూలు జిల్లా ఆదోని వాసులు తమ చిన్నారులు పదవ తరగతిలో మంచి మార్కులతో పాస్ అయ్యారన్న సంతోషంలో.. స్వామివార్లకు మొక్కులు చెల్లించేందుకు ఆ కుటుంబ సభ్యులు.. బంధుమిత్రులతో కలిసి శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం పయనమయ్యారు. సంతోషంగా స్వామి అమ్మవార్లను దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలోనే విధి వక్రీకరించి ఆత్మకూరు మండలం బైర్లూటి సమీపంలో వారు ప్రయాణిస్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి పల్టీలు కొట్టడంతో ఐదుగురు చనిపోయారు. ఇంకా 13 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

శుక్రవారం సాయంత్రం సంఘటనా స్థలంలోనే నలుగురు చనిపోగా ఆ తర్వాత కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొక బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటనపై మంత్రి నారా లోకేష్, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. మంత్రి నారా లోకేష్ క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..