AP CM Jagan Delhi tour: రేపు ఢిల్లీకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. అమిత్‌షాతో భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

AP CM Jagan Delhi tour: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి గర్నవర్‌ ఎయిర్‌పోర్టుకు ...

AP CM Jagan Delhi tour: రేపు ఢిల్లీకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. అమిత్‌షాతో భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
Follow us
Subhash Goud

|

Updated on: Jan 18, 2021 | 5:45 PM

AP CM Jagan Delhi tour: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి గర్నవర్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి ఢిల్లీ బయలుదేరుతారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో జగన్‌ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఇతర కేంద్ర మంత్రులతో కూడా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.

అయితే ఏపీలో తాజాగా నెలకొన్న పరిణామాలపై జగన్‌ హోంశాఖ మంత్రి అమిత్ షా చర్చించే అవకాశం ఉంది. ఏపీ ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసంపై రాజకీయ దుమారం రేగుతోంది. దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఏపీలో నెలకొన్న పరిస్థితులపై అమిత్‌షాతో జగన్‌ చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. విగ్రహాల ధ్వంసం వెనుక రాజకీయ కుట్ర ఉందని నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం.

మరోవైపు ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌తోనూ సీఎం భేటీ అవుతారని తెలుస్తోంది. పెండింగ్‌ నిధులతో పాటు ప్రాజెక్టులు పూర్తయ్యేలా బడ్జెట్‌లో నిధులను కేటాయించాలని ఆర్థిక శాఖ మంత్రిని జగన్‌ కోరే అవకాశం ఉంది. మొత్తం మీద జగన్‌ ఆకస్మిక ఢిల్లీ పర్యటనపై ఏపీ రాజకీయాల్లో హట్‌ టాపిక్‌గా మారింది.

Also Read:

ఏపీ ఎలక్షన్ కమిషన్ వర్సెస్ జగన్ సర్కార్ : పంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైకోర్ట్ డివిజన్ బెంచ్ విచారణ, లైవ్ అప్డేట్స్

AP School Mobile App: ఏపీ స్కూళ్లలో టాయిలెట్స్‌ నిర్వహణ, విద్యార్థుల హాజరు కోసం మొబైల్‌ యాప్‌

Boat Accident: కృష్ణానది పడవ ప్రమాదానికి 14 ఏళ్లు.. ఇన్నేళ్లు అయినా ప్రజలను ఇంకా వెంటాడుతున్న పీడకల