Boat Accident: కృష్ణానది పడవ ప్రమాదానికి 14 ఏళ్లు.. ఇన్నేళ్లు అయినా ప్రజలను ఇంకా వెంటాడుతున్న పీడకల

Boat Accident: నదిలో పడవ ప్రయాణం అంటేనే ఒళ్లు జలదరిస్తుంది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. పడవలో ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేతిలో...

Boat Accident: కృష్ణానది పడవ ప్రమాదానికి 14 ఏళ్లు.. ఇన్నేళ్లు అయినా ప్రజలను ఇంకా వెంటాడుతున్న పీడకల
Follow us

|

Updated on: Jan 18, 2021 | 3:33 PM

Boat Accident: నదిలో పడవ ప్రయాణం అంటేనే ఒళ్లు జలదరిస్తుంది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. పడవలో ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ ప్రయాణం సాగించాలి. నదిలో పడవ ప్రమాదాలు ఎన్నో జరిగి ఎందరో జలసమాధి అయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌ నుంచి కర్నూలు జిల్లా సిద్దేశ్వరం, సంగమేశ్వరం, బండి ఆత్మకూర్‌ వైపు ప్రమాదకరమైన పడవ ప్రయాణాలు కొనసాగుతూనే ఉన్నాయి.

నాగర్‌కర్నూలు జిల్లా మంచాలకట్టు సమీపంలో కృష్ణానదిలో పడవ ప్రమాదం జరిగి నేటితో 14 ఏళ్ల పూర్తయింది. ఈ ప్రమాదంలో 61 మంది జలసమాధి అయ్యారు. ఈ ప్రమాదానికి ఇన్నేళ్లు గడిచినా.. ఆ పీడకల భక్తులను ఇంకా వెంటాడుతూనే ఉంది. వివరాల్లోకి వెళితే.. కొల్లాపూర్‌ మండలం సింగోటంలో వెలసిన లక్ష్మీ నరసింహాస్వామి రాయలసీమ ప్రజలకు ఇంటి వేల్పు తమ ఇష్టమైన దైవాన్ని దర్శించుకునేందుకు ప్రతి ఏడాది భక్తులు పెద్ద ఎత్తున తరలివెళ్తుంటారు.

అయితే ఎప్పటిలాగే భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నెహ్రూనగర్‌ బోటింగ్‌ పాయింట్‌ నుంచి 2007 జనవరి 18వ తేదీన పడవలో బయలుదేరారు. మంచాలకట్ట బోటింగ్‌ పాయింట్‌ రాకముందే పడవ మునిగిపోయింది. అందులో భక్తులు సామర్థ్యానికి మించి ఉండటంతో నీటిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 61 మంది భక్తులు కృష్ణమ్మ ఒడిలో జలసమాధి అయ్యారు. ఈ ఘటన ఇప్పటికి ఉమ్మడి రాష్ట్రంలోనే కాక దేశ వ్యాప్తంగా కలకలం రేపింది.

ఈ ప్రమాద సంఘటన తెలుగు రాష్ట్రాన్ని తీవ్ర విషాదంలో నింపింది. నది తీరాల ప్రాంతాల నుంచి వంతెన ఆవశ్యకతపై డిమాండ్‌ పెరగడంతో అప్పటి ఉమ్మడి ప్రభుత్వం ప్రణాళికలను రచించింది. రూ.149.40 కోట్లతో సోమశిల సిద్దేశ్వరం వంతెన నిర్మాణానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. 2009 ఫిబ్రవరి 13న కొల్లాపూర్‌ పట్టణంలో వంతెన నిర్మాణానికి శిలాఫలంక వేశారు. 2011-12 వార్షిక బడ్జెట్‌లో నిధులు సమకూర్చారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా వంతె నిర్మాణానికి రూ.112 కోట్లు కేటాయించి సాయిల్‌ టెస్టింగ్‌ చేపట్టింది. కానీ నాటి నుంచి నేటి వరకు వంతె నిర్మాణం పనులు ఏ మాత్రం జరగలేదు.

నారగ్‌ కర్నూలు జిల్లా కొల్లాపూర్‌, అంచ్చంపేట, తెలకపల్లి, వవపర్తి తదితర గ్రామాల ప్రజలకు రాయలసీమ తీవ్ర ప్రాంతాల ప్రజలతో బంధుత్వం ఉంది. కర్నూలు జిల్లా ఆత్మకూరు, నందికట్కూరు, నంద్యాల ప్రాంతాల ప్రజలు రోడ్డు మార్గం గుండా కొల్లాపూర్‌కు రావాల్సి ఉండగా, దాదాపు 250 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. కృష్ణానదిలో బోటు ద్వారా రెండు కిలోమీటర్లు ప్రయాణం చేస్తే కొల్లాపూర్‌ ప్రాంతానికి చేరుకోవచ్చు. కృష్ణా నదిపై వంతెన నిర్మాణం చేపడితే దూరం తగ్గిపోవడమే కాకుండా వెనుకబడిన కొల్లాపూర్‌కు పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉంది. కొల్లాపూర్‌ వాణిజ్య, పర్యాటక అభివృద్ధి చెందుతుంది.

Also Read: Brutal Murder in Prakasam: యువకుడి దారుణ హత్య.. గొంతు కోసి చంపేశారు.. ఘటనకు సంబంధించి కారణాలు ఇలా..