Faria Abdullah: అబ్బో.! అమ్మడి కోరికలు మాములుగా లేవుగా.. ఫరియా అబ్దుల్లాకు కాబోయే వాడు అలా ఉండాలట

తొలి సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో అమాయకంగా నటించి ప్రేక్షకులను మెప్పించింది. జాతిరత్నాలు సినిమాలో చిట్టిగా ప్రేక్షకులకు దగ్గరయింది ఈ చిన్నది. ఆ తర్వాత పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది. అలాగే నాగార్జున, నాగచైతన్య నటించిన బంగార్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్ లోనూ నటించి మెప్పించింది

Faria Abdullah: అబ్బో.! అమ్మడి కోరికలు మాములుగా లేవుగా.. ఫరియా అబ్దుల్లాకు కాబోయే వాడు అలా ఉండాలట
Faria Abdullah
Follow us

|

Updated on: Apr 26, 2024 | 7:31 PM

పొడుగు కాళ్ళ సుందరి ఫరియా అబ్దుల్లా ఆచితూచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. జాతిరత్నాలు సినిమాతో సినిమాల్లోకి వచ్చింది ఈ హైదరాబాదీ అందం. తొలి సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో అమాయకంగా నటించి ప్రేక్షకులను మెప్పించింది. జాతిరత్నాలు సినిమాలో చిట్టిగా ప్రేక్షకులకు దగ్గరయింది ఈ చిన్నది. ఆ తర్వాత పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది. అలాగే నాగార్జున, నాగచైతన్య నటించిన బంగార్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్ లోనూ నటించి మెప్పించింది ఈ  ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు అల్లరి నరేష్ తో కలిసి సినిమా చేస్తుంది.

ఆ ఒక్కటి అడక్కు అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మల్లి అంకం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాతో అల్లరి నరేష్ మరోసారి హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి.

ఈ క్రమంలోనే ఫరియా అబ్దుల్లా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో ఫరియా అబ్దుల్లా ఆసక్తికర కామెంట్స్ చేసింది. తనకు ఎలాంటి వరుడు కావాలో తెలిపింది. తనకు కాబోయే భర్త ..తనకన్నా కంటే హైట్ తక్కువున్నా పర్లేదు. కానీ అతడిలో మంచి సెన్సాఫ్ హ్యుమర్ ఉండాలి అని చెప్పుకొచ్చింది. అలాగే తన లైఫ్ లో ఎన్నో స్ట్రగుల్స్ ఉన్నాయని కానీ నా భర్త మాత్రం ఫన్ గా ఉంటే చాలు అని తెలిపింది. ఫరియా అబ్దుల్లా మంచి డాన్సర్ కూడా ఆమె సోషల్ మీడియాలో తన డాన్స్ వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ చిన్నదాని డాన్స్ కు ఫ్యాన్స్ ఉన్నారు. ఫరియా అబ్దుల్లా ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగు పెడుతుంది. త్వరలోనే ఓ తమిళ్ సినిమాతో అక్కడ ఎంట్రీ ఇవ్వనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.