VV Vinayak: కెమెరా, స్టార్ట్, యాక్షన్.. వైసీపీ డైరెక్షన్‌లో వివి వినాయక్.. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం..
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ అంతటా ఎలక్షన్ ఫీవర్ పీక్స్‌కి చేరింది. ఆయా పార్టీల అధిష్టానాలు టిక్కెట్ల కేటాయింపులో బిజీగా ఉంటే.. నియోజకవర్గాల వారీగా తమతమ సామాజిక బలాబలాల్ని లెక్కలేసుకుంటూ ఎలక్షన్ హీట్‌ని పెంచేస్తున్నారు స్థానిక నేతలు.. ఈ క్రమంలోనే ఏపీలోని అధికార పార్టీ వైసీపీ మార్పులు చేర్పులతో దూసుకెళ్తోంది.
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ అంతటా ఎలక్షన్ ఫీవర్ పీక్స్‌కి చేరింది. ఆయా పార్టీల అధిష్టానాలు టిక్కెట్ల కేటాయింపులో బిజీగా ఉంటే.. నియోజకవర్గాల వారీగా తమతమ సామాజిక బలాబలాల్ని లెక్కలేసుకుంటూ ఎలక్షన్ హీట్‌ని పెంచేస్తున్నారు స్థానిక నేతలు.. ఈ క్రమంలోనే ఏపీలోని అధికార పార్టీ వైసీపీ మార్పులు చేర్పులతో దూసుకెళ్తోంది. టికెట్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న సీఎం జగన్.. వై నాట్ 175 అంటూ ముందుకువెళ్తున్నారు. అన్ని సామాజిక అంశాలను పరిగణలోకి తీసుకుని.. ఇన్‌ఛార్జులను ప్రకటిస్తున్నారు. ఈ తరుణంలో ఏపీ రాజకీయాల్లో ఓ ఆసక్తికర విషయం చర్చనీయాంశంగా మారింది. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ V.V.వినాయక్ వైసీపీలో చేరనున్నట్టు ప్రచారం జరుగుతుండటంతో ఏపీ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి.
వివి వినాయక్ వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.. ఈ మేరకు ఇప్పటికే సంప్రదింపులు పూర్తయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వినాయక్‌ను ఎక్కడ నుంచి బరిలోకి దింపాలి అనేదానిపై అధిష్ఠానం దృష్టి పెట్టింది.. ఈ మేరకు పలు స్థానాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఏలూరు, మచిలీపట్నం, కాకినాడ స్థానాల్లో ఏదో ఒక స్థానంలో వివి వినాయక్ ను బరిలోకి దింపాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలపై ఫోకస్ పెట్టిన వైసీపీ.. ఆయా స్థానాల్లో కీలక అభ్యర్థులను రంగంలోకి దించనుంది. ఈ క్రమంలో వివి వినాయక్ పేరును పార్టీ అధిష్టానం పరిశీలించి.. సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.. ఈ క్రమంలో వివి వినాయక్ వైసీపీ పార్టీలో చేరితే.. పోటీ చేసే స్థానంపై క్లారిటీ రానుంది.
అయితే, వైసీపీలో చేరనున్నట్లు వస్తున్న వార్తలపై వివి వినాయక్ ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు.. ఆయన స్పందించిన తర్వాత అసలు విషయం తెలియనుంది.. టాలీవుడ్ నటులు, డైరెక్టర్లు పోటీ చేస్తున్నారన్న సమాచారంతో ఏపీ రాజకీయాలు మున్ముందు మరింత ఆసక్తికరంగా మారుతాయని.. రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..