Andhra Pradesh: వీడు మామూలోడు కాదు.. పోలీసుల కళ్ళు కప్పి పారిపోయాడు.. 3 నెలల్లోనే మరో 10 నేరాలు
పది కేసుల్లో 28 తులాలకు పైగా బంగారం, 39 తులాల వెండి, 1.48 లక్షల నగదు అపహరించాడు. వీటిలో 22తులాల బంగారం, 2500 నగదు పోలీసులు సీజ్ చేశారు. మరికొంత బంగారం హైదరాబాదులోనే ప్రైవేట్ బ్యాంకులో తనకా పెట్టినట్టు గుర్తించారు. వామ్మో వీడు మామూలు దొంగోడు కాదు.. దొంగతనాలకు బాగా అలవాటు పడ్డాడు .. ఉదయం పూట ఇళ్లలో చొరబడి దొంగతనం చేయడంలో ఆరితేరిపోయాడు. వివిధ కేసుల్లో జైలుకు కూడా వెళ్ళాడు. ఎట్టకేలకు..
విశాఖపట్నం, జనవరి 05; వాడు దొంగతనాలకు అలవాటు పడ్డాడు .. ఉదయం పూట ఇళ్లలో చొరబడి దొంగతనం చేయడంలో ఆరితేరిపోయాడు. వివిధ కేసుల్లో జైలుకు కూడా వెళ్ళాడు. అయితే జైలు నుంచి కోర్టుకు తీసుకెళుతున్న క్రమంలో.. పోలీసుల కళ్ళు కప్పి ఒకసారి పారిపోయాడు. పట్టుకుని జైల్లో పెట్టారు.. మల్లీ అదే సీన్.. పోలీసుల కళ్ళు గప్పి పారిపోయాడు. అయినా ఏమాత్రం తగ్గలేదు.. మూడు నెలల కాలంలో అనకాపల్లి జిల్లాలో దూకుడు పెంచాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా.. చివరకు అలా….!
– పరవాడ సిఐ ఈశ్వరరావు, అనకాపల్లి క్రైమ్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన పిల్ల నూకరాజు (33) గతంలో వ్యాపారం చేసుకునేవాడు. ఆ తర్వాత చెడు వ్యాసనాలకు అలవాటు పడ్డాడు. జూదానికి బానిసై అప్పులపలై ఆస్తులన్నీ పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత నేరాల బాట పట్టాడు.
– డిసెంబర్ 7వ తేదీన.. పరవాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్ మంత్రి పాలెం లో ఇంట్లో చోరీ జరిగింది. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పరవాడ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫింగర్ ప్రింట్స్ సేకరించి పాత నేరస్తుల డేటాతో సరిపోల్చి.. పరవాడలో చోరీ కేసులో నిందితుడు పిల్ల నూకరాజు గా అనుమానించారు. గాలిస్తూ ఉండగా ఈనెల 4న లంకెలపాలెం జంక్షన్ లో నూకరాజును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విచారించేసరికి.. మంత్రి పదంలో చోరీ చేసిన తానేనని ఒప్పుకున్నాడు. దీంతో అతని అరెస్టు చేశారు పోలీసులు.
పారిపోయి..నేరాలు చేసి..
– పిల్ల నూకరాజు.. గతంలో పలుమార్లు జైలుకెళ్లాడు. అక్టోబర్లో ఎస్ రాయవరం పోలీసులు నూకరాజును అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అక్టోబర్ 27న సెంట్రల్ జైలు నుంచి కోర్టుకు తరలిస్తుండగా ఎలమంచిలి లో ఒకసారి పోలీసుల కళ్ళు కప్పి పారిపోయాడు. ఆఫీసులో నవంబర్ 7న అరెస్టు చేసిన పోలీసులు మళ్లీ కోర్టు ఆదేశాలతో జైలుకు తరలించారు. నవంబర్ 21న.. విజయనగరం టూ టౌన్ పోలీసులు వాయిదా కోసం నూకరాజును జైలు నుంచి తరలిస్తుండగా విజయనగరం పోలీసుల కళ్ళు కప్పి పారిపోయాడు. నవంబర్ 21 విజయనగరం నుంచిపారిపోయిన నూకరాజు.. నేరాలు చేస్తూనే ఉన్నాడు. అనకాపల్లి రావికమతం పరిధిలో మూడు, దేవరపల్లి లిమిట్స్ లో రెండు, సబ్బవరం లిమిట్స్ లో ఒకటి, చీడికాడలో కూడా చోరీలు చేశాడు. బుచ్చయ్యపేట పరవాడ పోలీస్స్టేషన్ల లిమిట్స్ లోను నేరాలు చేశాడు. పది కేసుల్లో 28 తులాలకు పైగా బంగారం, 39 తులాల వెండి, 1.48 లక్షల నగదు అపహరించాడు. వీటిలో 22తులాల బంగారం, 2500 నగదు పోలీసులు సీజ్ చేశారు. మరికొంత బంగారం హైదరాబాదులోనే ప్రైవేట్ బ్యాంకులో తనకా పెట్టినట్టు గుర్తించారు.
– ఎట్టకేలకు పరవాడ పోలీసులకు నూకరాజు చిక్కడంతో ఊపిరి పీల్చుకున్నారు. సొత్తును రికవరీ చేసి నిండుతుడని మరోసారి కటకటాల వెనక్కు నెట్టారు. ఇప్పటికైనా బుద్ధి మారి ఉంటాడా లేక.. మళ్లీ తప్పించుకొని నేరాలు చేసి మరిన్ని కేసుల్లో నిందితుడుగా ఉంటాడా అన్నది పోలీసు వర్గాల్లోనే మెదులుతున్న ప్రశ్న.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..