Tirumala: సిగ్గుందా.. పవిత్ర తిరుమలలో ఇవేం పిచ్చిపనులు

రీల్స్‌ పిచ్చి తిరుమల పవిత్రతను దెబ్బతీస్తుంది. సోషల్‌ మీడియా వ్యూస్‌ కోసం తిరుమలలో రీల్స్‌ చేస్తున్నారు కొందరు యువతీ యువకులు. పవిత్ర తిరుమలలో ఆధ్యాత్మికం కన్నా సోషల్‌ మీడియా వీడియోలకే ప్రాధాన్యత ఇవ్వడం చర్చనీయాంశం అయింది.

Tirumala: సిగ్గుందా.. పవిత్ర తిరుమలలో ఇవేం పిచ్చిపనులు
Tirumala Reels
Follow us
Raju M P R

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 04, 2024 | 3:34 PM

తిరుమల కొండమీద పవిత్రను కాపాడడానికి టీటీడీ ఎన్నో చర్యలు చేపడుతోంది. అయితే కొంతమంది యువతీ యువకులు మాత్రం తమ సోషల్‌ మీడియా పిచ్చితో పవిత్రతకు భంగం కలిగిస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం ముందు వివాదాస్పద వ్యాఖ్యలు, రాజకీయ ప్రసంగాలు.. ఫోటోషూట్‌లు, రీల్స్‌ షూట్‌లు జరుగుతూనే ఉన్నాయి.

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో సినిమా పాటలకు డాన్సులు వేస్తూ వీడియోలు తీసుకుంటున్నారు. వాటిని రీల్స్ రూపంలో ఇన్ స్ట్రా, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, స్నాప్‌చాట్‌ వంటి సోషల్‌ మీడియా యాప్స్‌లో పెడుతున్న యువతీ యువకులు తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్యనే బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక, శివ చేసిన ప్రాంక్ వీడియో కలకలం రేపింది. ఆ తర్వాత సారీ చెప్పే పరిస్థితి ఏర్పడింది. అంతకుముందు దివ్వల మాధురి ఫొటోషూట్‌.. మైన్స్‌ వ్యాపారి ఫోటోషూట్ వ్యవహారం కూడా వివాదాస్పదంగా మారింది. నాలుగు రోజుల క్రితం తిరుమల ఘాట్ రోడ్‌లో సెల్ఫీలు, ఫోటోలు వీడియోలు కోసం కొందరు యువకులు కారు డోర్లు తీసి హంగామా చేయడం కూడా భక్తులను ఇబ్బందులకు గురి చేసింది.

ఇప్పుడు తిరుమలలో రీల్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అలిపిరి టోల్ గేట్, తిరుమల ఆలయం ముందు, మాడ వీధుల్లో సినిమా పాటలకు ఎంజాయ్ చేసిన యూత్ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టులు పెట్టడం వివాదాస్పదంగా మారింది.

టీటీడీ తీసుకుంటున్న చర్యలేంటి. నిఘా సిబ్బంది ఏం చేస్తోంది.

తిరుమల పవిత్రత కు భంగం కలిగేలా చేసిన రీల్స్ పై చర్చించుకుంటున్న భక్తులు ఆలయ పరిసరాల్లో ఇలాంటివి జరుగుతుంటే టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఏం చేస్తోందని ప్రశ్నిస్తున్నారు. భక్తుల కళ్ళ ముందు యదేక్షగా ఇలాంటి రీల్స్ చేస్తుంటే విజిలెన్స్ సిబ్బంది నిఘా లేకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. సినిమా పాటలకు, అభిమాన హీరోల డైలాగులను రిల్స్ గా చిత్రీకరించి పోస్టులు పెడుతున్న యువతను ఎందుకు కట్టడి చేయడం లేదని ఆరోపిస్తున్నారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటున్న టీటీడీ ఆలయం ముందు కనీసం రాజకీయ ప్రసంగాలు చేసేందుకు వీళ్లేదని ఈ మధ్యనే నిర్ణయం కూడా తీసుకుంది. అలాంటప్పుడు పవిత్రతకు భంగం కలిగేలా జరుగుతున్న చర్యలపై నిఘా వ్యవస్థ చర్య లేవని భక్తులు ప్రశ్నిస్తున్నారు. దీంతో రీల్స్ పై ఆరా తీస్తున్న టీటీడీ రీల్స్ వ్యవహారాన్ని సీరియస్ గా పరిగణిస్తోంది. తిరుమల పవిత్రతకు భంగం కలిగించి కోట్లాదిమంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించే చర్యలపై కొరడా జులిపించేందుకు సిద్ధమైంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి. 

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!