Tirumala: తిరుమలలో అన్యమత గుర్తుల వస్తువులు విక్రయం..రంగంలోకి టీటీడీ
తిరుమల అన్యమత ప్రచారం ఎప్పుడూ చర్చగానే నడుస్తుంది. తరచూ ఈ అంశం వివాదాస్పదంగా మారుతుంది. టీటీడీ కఠిన చర్యలు తీసుకుంటున్న నిఘా వైఫల్యం కొనసాగుతూనే ఉంది. అయితే ఈ రోజు తిరుమలలో అన్యమతం గుర్తు, పేరు ఉన్న స్టీల్ కడియం అమ్మకం కలకలం రేపింది.
హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల.. అయితే అన్యమత ప్రచారం ఎప్పుడూ చర్చగానే నడుస్తుంది. తరచూ ఈ అంశం వివాదాస్పదంగా మారుతుంది. టీటీడీ కఠిన చర్యలు తీసుకుంటున్న నిఘా వైఫల్యం కొనసాగుతూనే ఉంది. టీటీడీలో పనిచేసే అన్యమత ఉద్యోగులను తప్పించాలని ఇప్పటికే పాలకమండలి చర్యలు తీసుకుంటోంది. భక్తుల మనోభావాలను కాపాడే ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ రోజు తిరుమలలో అన్యమతం గుర్తు, పేరు ఉన్న స్టీల్ కడియం అమ్మకం కలకలం రేపింది.
సీఆర్వో ఆఫీస్ ఎదురుగా ఉన్న SNC షెడ్డులోని 3వ నంబర్ షాపులో కొనుగోలు చేసిన స్టీల్ కడియంపై అన్యమతానికి చెందిన గుర్తును భక్తుడు గుర్తించడంతో టీటీడీ అలెర్ట్ అయ్యింది. హైదరాబాద్‌కు చెందిన శ్రీధర్ అనే భక్తుడు కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించు కున్నారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్ చేశాడు. SNC షెడ్ లోని 3వ నంబర్ షాపులో స్టీల్ కడియాన్ని శ్రీధర్ కొనుగోలు చేశాడు. వసతి పొందిన గదికి వెళ్లి స్టీల్ కడియంను గమనించాడు శ్రీధర్.. స్టీల్ కడియంపై అన్యమతం గుర్తు, పేరు ఉండటంతో అవాక్కైన భక్తుడు విషయాన్ని టీటీడీ ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్ళాడు. ఛైర్మన్ ఆదేశంతో స్పందించిన విజిలెన్స్, టాస్క్ ఫోర్స్ సిబ్బంది భక్తుడిని వెంట తీసుకెళ్లి షాపులో తనిఖీలు నిర్వహించారు. షాపును క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిన ఎస్టేట్ ఆఫీసర్ తాత్కాలికంగా మూసివేసి విచారణ చేపట్టారు. ఇలా మరోసారి అన్యమతానికి సంబంధించిన వస్తువుల అమ్మకం తిరుమలలో బయటపడటం చర్చగా మారింది.
వీడియో ఇదిగో:
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి