AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: కళ్లల్లో కారం కొట్టి భర్తను అతి కిరాతకంగా హత్య చేసిన భార్య..

ఆనంద్ మీనాల మధ్య ఉన్న ప్రేమ వ్యవహరం గోవింద్‌కు తెలిసిపోతుందని భావించిన ఇద్దరు పక్కా ప్లాన్ వేశారు. ఆనంద్ సహాయంతో భర్త గోవిందును కడతేర్చాలని పథకం చేసిన మీనా పక్కాగా స్కెచ్ వేసింది. గొర్రెలను తీసుకొని అటవీ ప్రాంతంలో మేపుతుండగా

Andhra Pradesh: కళ్లల్లో కారం కొట్టి భర్తను అతి కిరాతకంగా హత్య చేసిన భార్య..
Murdered
Raju M P R
| Edited By: |

Updated on: Dec 07, 2024 | 8:28 PM

Share

చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్ వేసింది ఒక ఇల్లాలు. భర్తను అంతమొందించి అదృశ్యమయ్యాడని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. ప్రియుడిపై ఉన్న మోజుతో భర్తను కనిపించిన ఇల్లాలి బాగోతం బయటపడింది. శాంతిపురం మండలం సోలిశెట్టిపల్లి లో జరిగిన ఘటన వివరాల్లోకి వెళితే..

సోలిశెట్టిపల్లికి చెందిన గోవిందు, మీనా లకు 10 ఏళ్ల క్రితం పెళ్లయింది. ఇద్దరికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు. గొర్రెల కాపర్లు గా జీవనం సాగిస్తున్న గోవిందు, మీనా దంపతుల మధ్య రాళ్లబూదుగురు కు చెందిన ఆనంద్ ఎంట్రీ ఇచ్చాడు. గొర్రెల పెంపకంతో జీవనం సాగించే ఆనంద్ కు మీనాకు మధ్య పరిచయం ఏర్పడింది. గత కొద్ది కాలంగా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగింది. ఆనంద్ మీనాల మధ్య ఉన్న లవ్ మేటర్ గోవిందు కు తెలిసిపోతుందని భావించిన ఇద్దరు పక్కా ప్లాన్ వేశారు. ఆనంద్ సహాయంతో భర్త గోవిందును కడతేర్చాలని ప్లాన్ చేసిన మీనా పక్కాగా స్కెచ్ వేసింది.

గొర్రెలను తీసుకొని అటవీ ప్రాంతంలో మేపుతుండగా భర్త కళ్ళల్లో కారం కొట్టిన మీనా ప్రియుడి సహకారంతో అంతమోందించింది. బండరాయితో కొట్టి చంపిన ఆనంద్ మీనా లు గోవింద్ డెడ్ బాడీని కనిపించకుండా చేసే ప్రయత్నం చేశారు. మృతదేహాన్ని గోనెసంచిలో కుక్కి పక్కనే ఉన్న కర్ణాటక బార్డర్ లో పడేశారు. ఎవరికీ అనుమానం రాకుండా భర్త గోవిందును చంపిన భార్య మీనా ఏమీ తెలియనట్టు పోలీసులను ఆశ్రయించింది. తన భర్త కనిపించడం లేదంటూ ఈ నెల 4న ఫిర్యాదు చేసింది. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులకు మీనా వాలకంపై అనుమానం వచ్చింది. మర్డర్ చేసి మిస్సింగ్ కేసు ఇచ్చిన మీనా నే అసలు సూత్రధారిగా అనుమానించిన పోలీసులు ప్రియుడితో కలిసి భర్తను కిరాతకంగా హతమార్చినట్లు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

భర్త గోవింద్ కళ్ళల్లోకి కారం కొట్టి బండరాయి తో కొట్టి హతమార్చినట్లు తేల్చారు. గోవింద్ భార్య మీనా, ఆమె ప్రియుడు ఆనంద్ లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెబుతున్న పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించనున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
టెన్త్ పాసైన వారికి తెలంగాణ Polycet 2026 పరీక్ష.. పూర్తి వివరాలు
టెన్త్ పాసైన వారికి తెలంగాణ Polycet 2026 పరీక్ష.. పూర్తి వివరాలు
IND vs WI సెమీఫైనల్లో కీలక పాత్ర ఎవరిది.. ఎంట్రీ ఇస్తే షాకేనా..?
IND vs WI సెమీఫైనల్లో కీలక పాత్ర ఎవరిది.. ఎంట్రీ ఇస్తే షాకేనా..?
ఖర్జూరాలను ఈ టైమ్‌లో తింటున్నారా..? ఏం జరుగుతుందో తెలిస్తే ..
ఖర్జూరాలను ఈ టైమ్‌లో తింటున్నారా..? ఏం జరుగుతుందో తెలిస్తే ..
మరో 2 రోజుల్లో RRB రైల్వే అడ్మిట్ కార్డులు.. సీటీ వివరాలు చూశారా?
మరో 2 రోజుల్లో RRB రైల్వే అడ్మిట్ కార్డులు.. సీటీ వివరాలు చూశారా?
జీవితంలో ఇలాంటి వ్యక్తులకు అస్సలు సాయం చేయకండి.. చేసి బాధపడకండి
జీవితంలో ఇలాంటి వ్యక్తులకు అస్సలు సాయం చేయకండి.. చేసి బాధపడకండి
వైరల్‌ వీడియోపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్లారిటీ!
వైరల్‌ వీడియోపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్లారిటీ!
పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. ఈ పని చేస్తే ఇక అంతే..
పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. ఈ పని చేస్తే ఇక అంతే..
మీరు చెడు అనుకునే ఈ ఆహారాలన్నీ పళ్లకు ఎంత మంచివో తెలుసా..?
మీరు చెడు అనుకునే ఈ ఆహారాలన్నీ పళ్లకు ఎంత మంచివో తెలుసా..?
చరిత్రలో నిలిచిపోయే వీడ్కోలు..ఆస్ట్రేలియా కెప్టెన్ విశ్వరూపం
చరిత్రలో నిలిచిపోయే వీడ్కోలు..ఆస్ట్రేలియా కెప్టెన్ విశ్వరూపం
ఈ ఆకును మజ్జిగలో కలిపి తాగితే ఆ సమస్యకు చూమంత్రం వేసినట్టే!
ఈ ఆకును మజ్జిగలో కలిపి తాగితే ఆ సమస్యకు చూమంత్రం వేసినట్టే!