తిరుమలలోని అతిధి గృహాలపై దాతల పేర్లు మాయం..! అసలు విషయం ఏంటంటే…
జిఎంఆర్ విశ్రాంతి భవనానికి ఆనంద నికేతనం, మాగుంట నిలయం కు రాఘవ నిలయం, మైహోమ్ పద్మప్రియ కు పద్మప్రీయ నిలయం, సుధాకృష్ణ నిలయంకు వైకుంఠ నిలయం, శ్రీ రచన కు గెస్ట్ హౌస్ కు విధాత నిలయం, పాండవ విశ్రాంతి భవనం కు విరజా నిలయంగా పేర్లు మార్పు చేసారు దాతలు. ఇకపై నిర్మాణాలు జరిగే ఏ కార్యాలయమైనా, విశ్రాంతి భవనమైనా భగవంతుడి నామమే ఉండాలని చైర్మన్ అధికారులను సూచించారు.

తిరుమలలో ప్రైవేట్ అతిథి గృహాలకు పేర్లు మారిపోయాయి. టిటిడి చైర్మన్ ఆదేశంతో విశ్రాంతి భవనాలకు భగవంతుడి పేర్లు మార్చుతూ టీటీడీ ప్రొసీడింగ్స్ జారీ చేసింది. తిరుమలలో మరింత ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. తిరుమలలో శ్రీవారి పేర్లు, గోవింద నామస్మరణ మాత్రమే వినపడాలంటున్న టిటిడి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దాతల సొంత పేర్లు ఉన్న 42 విశ్రాంతి భవనాలకు మార్చిన పేర్లను టీటీడీ ప్రకటించింది.
గత ఏడాది డిసెంబర్ 24న జరిగిన పాలక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసింది టీటీడీ. తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం మరింత ఉట్టిపడేలా టీటీడీ ఈ మేరకు అడుగులు వేసింది. తిరుమలలో దాతలు నిర్మించి టీటీడీ స్వాధీనం చేసిన విశ్రాంతి భవనాల్లో 42 భవనాలకు దాతల సొంత పేర్లు ఉండగా వాటిని మార్చాలని గత డిసెంబర్ నెల 24 న జరిగిన పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. భగవంతుడికి సంభందించి 75 పేర్లను సూచించి, వాటిలో ఎదైనా ఒకటి గెస్ట్ హౌస్ కు పేరు గా పెట్టుకోవాలని బోర్డు అదేశించింది. ఇందులో భాగంగానే 42 గెస్ట్ హౌస్ లకు పేర్లు మారాయి.
జిఎంఆర్ విశ్రాంతి భవనానికి ఆనంద నికేతనం, మాగుంట నిలయం కు రాఘవ నిలయం, మైహోమ్ పద్మప్రియ కు పద్మప్రీయ నిలయం, సుధాకృష్ణ నిలయంకు వైకుంఠ నిలయం, శ్రీ రచన కు గెస్ట్ హౌస్ కు విధాత నిలయం, పాండవ విశ్రాంతి భవనం కు విరజా నిలయంగా పేర్లు మార్పు చేసారు దాతలు. ఇకపై నిర్మాణాలు జరిగే ఏ కార్యాలయమైనా, విశ్రాంతి భవనమైనా భగవంతుడి నామమే ఉండాలని చైర్మన్ అధికారులను సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..