TTD: తిరుమల శ్రీవారి భక్తులకు కీలక అలెర్ట్.. ఆ 3 రోజులు వారికి దర్శనాలు రద్దు
Tirumala News: సాధారణ భక్తుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది TTD. ఇకపై ఆ మూడు రోజులు VIP దర్శనాలను ఉండవని స్పష్టం చేసింది.
Alert for Srivari devotees: సర్వదర్శనాలకు పెద్దపీట వేస్తోంది TTD. శ్రీవారి దర్శనానికి వచ్చే సాధారణ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇక నుంచి శుక్ర, శని, ఆదివారాల్లో VIP దర్శనాలు ఉండవని స్పష్టం చేసింది. ఆ మూడురోజులు VIP దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. సిఫార్సు లేఖలు కూడా తీసుకురావొద్దని సూచించింది. అలాంటి వారికి దర్శనం కల్పించే అవకాశమే లేదని స్పష్టం చేస్తోంది TTD. పాలకమండలి సభ్యుల నుంచి ఉన్నతాధికారుల వరకు ఎవరి సిఫార్సుపైనా బ్రేక్ దర్శనం కల్పించలేమని తేల్చి చెబుతున్నారు అధికారులు. VIPల కోసం కేటాయించిన సమయాన్ని సామాన్య భక్తులకు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది TTD. ఏప్రిల్ 1 నుంచి సాధారణ దర్శనాలతో పాటు ఆర్జిత సేవల్లోనూ భక్తులకు పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తోంది. శుక్ర, శని, ఆదివారాల్లో సర్వదర్శనం భక్తుల కోసం అదనంగా దర్శన టోకెన్లు జారీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే రోజుకు 30 వేల సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు పొందలేని భక్తులు..సిపార్సు లేఖలపై శుక్ర-శని-ఆదివారాల్లో వచ్చే భక్తులు.. సర్వదర్శనం టిక్కెట్లతో శ్రీవారిని దర్శించుకోవచ్చని తెలిపింది. తిరుపతి శ్రీనివాసం అతిధి గృహం, భూదేవి కాంప్లెక్స్, గోవిందరాజ స్వామి సత్రాల వద్ద సర్వ దర్శనం టైం స్లాట్ బుకింగ్ సౌకర్యాన్ని అందిస్తోంది. నిబంధనలు పాటించే భక్తులకే శ్రీవారి దర్శనం కల్పిస్తామని.. వీఐపీ దర్శనం కోసం వచ్చేవారు ఇది గమనించాలని స్పష్టం చేసింది.
Also Read: ప్రభాస్ రేంజ్ ఇకపై పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్.. ‘రాధే శ్యామ్’ ట్విట్టర్ రివ్యూ