AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Traffic Diversions: శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమలలో ట్రాఫిక్ మళ్లింపు.. పూర్తి వివరాలు ఇవే

శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల తిరుపతి భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదివారం శ్రీవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో కీలకమైన వాహనసేవ గరుడోత్సవం జరగనున్న నేపథ్యంలో టీటీడీ భక్తులకు కొన్ని సూచనలు చేసింది. గరుడ వాహన సేవ సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండటం వల్ల తిరుపతి నగరంలో ట్రాఫిక్ డైవర్షన్లు అమల్లోకి వస్తాయని పోలీసులు తెలిపారు.

Traffic Diversions: శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమలలో ట్రాఫిక్ మళ్లింపు.. పూర్తి వివరాలు ఇవే
Tirumala
Anand T
|

Updated on: Sep 27, 2025 | 3:14 PM

Share

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన ఘట్టం గరుడ వాహన సేవ.. ఇందులో భాగంగా శ్రీవేంకటేశ్వరస్వామిని ఆలయ మాడవీధుల్లో గరుడవాహనంపై విహరిస్తారు. ఈ కార్యక్రమంలో సగం బ్రహ్మోత్సం పూర్తయినట్లు చెబుతారు.ఈ కీలక ఘట్టాన్ని చూసేందుకు జిల్లా నుంచే కాకుండా, దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి కూడా యాత్రికులు, భక్తులు భారీగా తరలివస్తారు. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమలలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పోలీసులు తెలిపారు.

సెప్టెంబర్ 27న రాత్రి 9 గంటల నుండి 29న ఉదయం 6 గంటల వరకు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలు రద్దు చేయబడ్డాయి. అలిపిరి పాత చెక్పోస్ట్ వద్ద ద్విచక్ర వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ సదుపాయం కల్పించబడుతుంది. పార్కింగ్ ప్రదేశాల కోసం QR కోడ్ ను ఉపయోగించుకోవాలి. భక్తులు ఈ విషయాన్ని గమనించి పోలీస్ శాఖ, టీటీడీకి సహకరించాలని విజ్ఞప్తి చేయడమైనది.

తిరుమలలో పార్కింగ్ ఏర్పాట్లు

  • రాంభగీచ పార్కింగ్: వివిఐపి పెద్ద బ్యాడ్జెస్ వాహనాలు.
  • సప్తగిరి గెస్ట్ హౌస్ పార్కింగ్: విఐపి చిన్న బ్యాడ్జెస్ వాహనాలు.
  • సాధారణ వాహనాలు: ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా కేటాయించిన పార్కింగ్ ప్రాంతాలకు పార్కింగ్ చేసుకోవాలి.

తిరుమలలో ట్రాఫిక్ మళ్లింపులు

  • RTC రవాణా సౌకర్యం – తిరుపతి నుండి తిరుమల వరకు APSRTC, TTD ప్రత్యేక బస్సులు నిరంతరం నడపబడతాయి. భక్తులు వీటినే వినియోగించాలి.
  • అలిపిరి – కపిలతీర్థం మార్గం – భక్తుల రాకపోకల కోసం ప్రత్యేకంగా ఉంచబడింది. ప్రైవేట్ వాహనాలకు పరిమితులు ఉంటాయి.
  • RTC బస్ స్టాండ్ – అలిపిరి రోడ్ – వాహన రాకపోకలకు కేటాయించిన మార్గాలు మాత్రమే ఉపయోగించాలి. భక్తులు RTC బస్సులు/TTD వాహనాలను వినియోగించాలి.
  • ప్రైవేట్ వాహనాలు – కేటాయించిన పార్కింగ్ ప్రదేశాలలోనే నిలిపి ఉంచాలి. రోడ్ల పక్కన, అనధికారిక ప్రదేశాలలో వాహనాలు నిలపరాదు.వీధి వ్యాపారులు – ప్రధాన రహదారులపై వ్యాపారానికి అనుమతి లేదు.
  • ట్రాఫిక్ ప్రవాహం సజావుగా ఉండేందుకు సహకరించాలి.అత్యవసర వాహనాలు – అంబులెన్స్, ఫైర్ సర్వీస్, పోలీస్ వాహనాలకు మాత్రమే ప్రాధాన్యత మార్గాలు ఖాళీగా ఉంచబడతాయి.
  • ప్రత్యేక బోర్డులు, మైక్ ప్రకటనలు – ట్రాఫిక్ మార్పులు, డైవర్షన్లకు సంబంధించిన సమాచారాన్ని తప్పనిసరిగా పాటించాలి.
  • భక్తులందరూ పోలీస్ శాఖ, TTD సిబ్బంది, వాలంటీర్లకు సహకరించి భద్రతగా, ప్రశాంతంగా గరుడ వాహన సేవ దర్శించుకోవాలని జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేస్తున్నారు.
  • గరుడవాహన రోజున తిరుపతి పట్టణంలో పార్కింగ్ ఏర్పాట్లు (పార్కింగ్ ప్రదేశాల కొరకు QR కోడ్ ను ఉపయోగించుకోవాలని తెలిపారు
  • శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవముల సందర్బంగా, గరుడ సేవకు తిరుపతి వస్తున్న భక్తులు వారి వాహనాలను కింది సూచించిన పార్కింగ్ ప్రదేశాలలో నిలపవలసిందిగా తిరుపతి పోలీసు శాఖ విజ్ఞప్తి చేస్తున్నారు.

ద్విచక్ర వాహనాలు:

  • శనివారం (27.09.2025) రాత్రి 9 గంటల నుండి ఆదివారం (29.09.2025) ఉదయం 6 గంటల వరకు అలిపిరి ఘాట్ రోడ్లలో అనుమతి లేదు
  • కడప, శ్రీకాళహస్తి వైపు నుండి వచ్చే వాహనాలకు ఇస్కాన్ గ్రౌండ్, నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్, భారతీయ విద్యాభవన్ గ్రౌండ్ లలో టూ వీలర్, ఫోర్ వీలర్ పార్కింగ్ సదుపాయం కలదు.
  • చిత్తూరు, పీలేరు, ఇతర జిల్లాల నుండి వచ్చే టూరిస్టు వాహనాలు, టెంపో ట్రావెల్స్ వాహనాలకు దేవలోక్ ప్రాంగణంలో పార్కింగ్ సౌకర్యం ఉంది.
  • మదనపల్లి, చిత్తూరు నుండి వచ్చే వాహనాలకు భారతీయ విద్యాభవన్, నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్, ఇస్కాన్ టెంపుల్ గ్రౌండ్ లలో ఫోర్ వీలర్ పార్కింగ్ సదుపాయం కలదు.
  • గరుడ సేవకు టూ వీలర్లలో వచ్చే యాత్రికులకు అలిపిరి బాలాజీ లింక్ బస్టాండ్ వద్ద టూ వీలర్ పార్కింగ్ సదుపాయం కలదు.
  • కరకంబాడి వైపు నుండి వచ్చే వాహనాలకు ఎస్.వి. ఇంజినీరింగ్ కాలేజ్ వద్ద కట్-ఆఫ్ పార్కింగ్ ఏర్పాటు చేయబడింది.
  • మదనపల్లి, చిత్తూరు వైపు నుండి వచ్చే వాహనాలకు వకులమాత ఆలయం, చెర్లోపల్లి వద్ద పార్కింగ్ సదుపాయం కలదు.
  • పుత్తూరు వైపు నుండి వచ్చే వాహనాలకు మ్యాంగో మార్కెట్ నందు పార్కింగ్ సదుపాయం కలదు.
  • ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి ఏమనగా — చిత్తూరు, మదనపల్లి వైపు నుండి తిరుపతి లోపలికి వచ్చే RTC బస్సులు ఇకపై కాలూరు క్రాస్ మీదుగా, ఆర్.సీ.పురం మీదుగా, తనపల్లి – గరుడ ఫ్లై ఓవర్ గుండా బస్ స్టాండ్కు మళ్లించబడతాయి.
  • తిరుమలకు RTC బస్సుల ద్వారా ప్రయాణించే యాత్రికులు, నంది సర్కిల్ మరియు గరుడ సర్కిల్ మార్గం గుండా యథాప్రకారం తిరుమల వెళ్తారు.
  • పై పార్కింగ్ ప్రాంతాలలో తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే త్రాగు నీరు, భోజనం, టాయిలెట్స్ సదుపాయాలు, తిరుపతి నుండి తిరుమలకు చేసుకోవడానికి 24/7 RTC బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడమైనది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.