AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుపతిలో దారుణం.. నడిరోడ్డుపై డబుల్‌ మర్డర్‌ కలకలం..మహిళే సూత్రధారి?

ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి ఒక్కసారిగా ఘోర రక్తపాతంతో ఉలిక్కిపడింది. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే లక్ష్మీపురం సర్కిల్ పరిధిలోని శ్రీ పద్మావతి కళ్యాణ మండపాల వద్ద పగటిపూటే జంట హత్యలు జరగడం స్థానికంగా తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది. పాత కక్షల నేపథ్యంలోనే ఈ దారుణ హత్యలు జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

తిరుపతిలో దారుణం.. నడిరోడ్డుపై డబుల్‌ మర్డర్‌ కలకలం..మహిళే సూత్రధారి?
Tirupati Double Murder
Raju M P R
| Edited By: |

Updated on: Jul 09, 2026 | 7:43 AM

Share

టెంపుల్ సిటీ తిరుపతిలో గురువారం ఒక్కసారిగా కలకలం రేగింది. నగరంలోని లక్ష్మీపురం సర్కిల్, శ్రీ పద్మావతి కళ్యాణ మండపాల వద్ద పగటిపూటే నడిరోడ్డుపై ప్రత్యర్థులు విచక్షణారహితంగా దాడి చేసి ఇద్దరు వ్యక్తులను దారుణంగా హత్య చేశారు. మృతులను జీవకోనకు చెందిన మునిరత్నం (50), మణికంఠగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ ఒక వివాహ వేడుకకు హాజరై తిరిగి వెళ్తుండగా ఈ దారుణం జరిగింది. అప్పటికే అక్కడ కాపు కాసిన ప్రత్యర్థులు, రెండు బైక్‌లపై వీరిని వెంబడించారు. లక్ష్మీపురం సర్కిల్ వద్దకు రాగానే బైక్‌పై వెళ్తున్న మునిరత్నం, మణికంఠలను అడ్డుకుని కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు.

కత్తిపోట్లకు గురైన వారిలో ఒకరు రోడ్డుపైనే రక్తపు మడుగులో ప్రాణాలు విడిచారు. తీవ్రంగా గాయపడి, కొనఊపిరితో ఉన్న మరో వ్యక్తిని స్థానికులు రుయా ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ఆయన కూడా మృతి చెందారు. బాధితుడు రోడ్డుపై పడి ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న సమయంలోనూ నిందితులు ఏమాత్రం జాలి లేకుండా కసితీరా కత్తులతో పొడవడం అక్కడి వారిని భయబ్రాంతులకు గురి చేసింది.

హత్య జరుగుతున్న సమయంలో చుట్టుపక్కల ఉన్న కొందరు వ్యక్తులు తమ మొబైల్ ఫోన్లలో వీడియోలు తీశారు. ఆ విజువల్స్ ఆధారంగా… నలుగురు పురుషులతో పాటు ఒక మహిళ కూడా ఈ ఘోర హత్యలలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. హత్య అనంతరం నిందితులు రెండు బైక్‌లపై వేగంగా పరారైనట్టుగా తెలిసింది. ఘటన సమాచారం అందుకున్న వెంటనే డిఎస్పీ భక్తవత్సలం, ఈస్ట్ సీఐ శ్రీనివాసులు, వెస్ట్ సీఐ రామకృష్ణ తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ రంగంలోకి దిగి ఆధారాలు సేకరించింది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ (CCTV) ఫుటేజ్‌లను జల్లెడ పడుతున్నారు. నిందితుల గుర్తింపు కోసం, వారు పారిపోయిన మార్గాలను కనిపెట్టేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. పాత కక్షల వల్లే ఈ హత్యలు జరిగాయా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు ఒకే యాప్‌లో..!
ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు ఒకే యాప్‌లో..!
థియేటర్లలో ఫ్లాప్.. ఇప్పుడు OTTలో దుమ్మురేపుతోన్న రియల్ స్టోరీ
థియేటర్లలో ఫ్లాప్.. ఇప్పుడు OTTలో దుమ్మురేపుతోన్న రియల్ స్టోరీ
మంగళ గౌరీ వ్రతం స్పెషల్.. పరమాన్నం ఎలా వండాలంటే?
మంగళ గౌరీ వ్రతం స్పెషల్.. పరమాన్నం ఎలా వండాలంటే?
రేవతి నక్షత్రంలోకి శని.. ఇక ఈ రాశుల వారు ఆడింది ఆట పాడింది పాటే
రేవతి నక్షత్రంలోకి శని.. ఇక ఈ రాశుల వారు ఆడింది ఆట పాడింది పాటే
భర్తలను అదుపులో పెట్టుకునే భార్యలు వీరే.. మీ రాశి ఉందా?
భర్తలను అదుపులో పెట్టుకునే భార్యలు వీరే.. మీ రాశి ఉందా?
ఫోన్ చూపిస్తూ తినిపిస్తున్నారా.. పిల్లల పొట్టలో జరిగేది తెలిస్తే
ఫోన్ చూపిస్తూ తినిపిస్తున్నారా.. పిల్లల పొట్టలో జరిగేది తెలిస్తే
అల్లు శిరీష్ భార్య నయనికకు ఇంత అందమైన చెల్లి ఉందా? ఫొటోస్ ఇదిగో
అల్లు శిరీష్ భార్య నయనికకు ఇంత అందమైన చెల్లి ఉందా? ఫొటోస్ ఇదిగో
జార్ఖండ్‌లో JSSC CGL పరీక్షలు, ఫలితాలు రద్దు!
జార్ఖండ్‌లో JSSC CGL పరీక్షలు, ఫలితాలు రద్దు!
డ్రగ్ టెస్ట్‌లో మరో ఇద్దరు ఎయిర్ ఇండియా పైలట్లకు పాజిటివ్‌!
డ్రగ్ టెస్ట్‌లో మరో ఇద్దరు ఎయిర్ ఇండియా పైలట్లకు పాజిటివ్‌!
తాతా నువ్ కేక.. నీ తెలివికి హ్యాట్సాఫ్.. ఊతకర్రను కుర్చీలా..
తాతా నువ్ కేక.. నీ తెలివికి హ్యాట్సాఫ్.. ఊతకర్రను కుర్చీలా..