AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashada Masam 2026: ఆషాఢ మాసంలో భార్యాభర్తలు ఎందుకు దూరంగా ఉండాలి? పొరపాటున కలిస్తే ప్రమాదకరమా?

ఈసారి ఆషాఢ మాసం జూలై 15న ప్రారంభమవుతుంది. ఈ ఆషాఢ మాసం నూతన వధూవరులకు కొంత విచారకరమైన సందర్భం. ఎందుకంటే వివాహం తర్వాత భార్యాభర్తలు కొన్ని రోజుల పాటు ఒకరికొకరు దూరంగా ఉండవలసి వస్తుంది. అవును, ఆషాఢ మాసంలో ఎలాంటి శుభకార్యాలు జరపరు. ఈ సమయంలో వివాహం, నిశ్చితార్థం వంటి కార్యాలు జరపకూడదని అంటారు. అంతేకాదు, ఆషాఢ మాసంలో భార్యాభర్తలు కలిసి ఉండకూడదనే నమ్మకం కూడా భారతీయులలో ఉంది. దీనికి అసలు కారణం ఏంటి..? శాస్రాలు ఏం చెబుతున్నాయి..

Jyothi Gadda
|

Updated on: Jul 08, 2026 | 1:31 PM

Share
భారతీయ సంస్కృతిలో ప్రతి పండుగ, ప్రతి ఆచారం వెనుక ఒక బలమైన కారణం దాగి ఉంటుంది. వాటిలో ఒకటి ఆషాఢ మాసం నియమం. ఆషాఢ మాసం రాగానే కొత్తగా పెళ్లయిన దంపతులను ఒకరికొకరు దూరంగా ఉంచుతారు. సాధారణంగా పెళ్లయిన మొదటి ఏడాది ఆషాఢంలో అత్తా-కోడళ్లు ఒకే ఇంట్లో ఉండకూడదని, కొత్త పెళ్లికూతురిని పుట్టింటికి పంపేయడం మనకు తెలిసిందే. అయితే, దీనిని చాలా మంది కేవలం ఒక సెంటిమెంట్‌గా లేదా మూఢనమ్మకంగా భావిస్తారు. కానీ, మన పెద్దలు ఏర్పాటు చేసిన ఈ ఆచారం వెనుక అద్భుతమైన శాస్త్రీయ, మానసిక కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
నవజాత శిశువు ఆరోగ్యం: శాస్త్రీయ కోణం ప్రకారం, ఆషాఢ మాసం సాధారణంగా జూన్-జూలై నెలల్లో వస్తుంది. ఒకవేళ ఈ నెలలో కొత్త జంట కలిసి ఉండి, స్త్రీ గర్భం దాల్చితే.. సరిగ్గా తొమ్మిది నెలల తర్వాత అంటే వచ్చే చైత్ర లేదా వైశాఖ మాసంలో (మార్చి-ఏప్రిల్-మే) కాన్పు జరుగుతుంది. ఆ సమయంలో భారతదేశంలో వేసవి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. విపరీతమైన ఎండల వల్ల పుట్టిన పసిబిడ్డకు, బాలింతకు ఇన్ఫెక్షన్లు రావడం, డీహైడ్రేషన్ బారిన పడటం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. పూర్వకాలంలో వైద్య సదుపాయాలు తక్కువగా ఉండటం వల్ల, ఎండల తీవ్రత నుండి తల్లిని, బిడ్డను రక్షించడానికే ఈ నియమాన్ని పెట్టారు.

2 / 5
వాతావరణం, శారీరక మార్పులు: ఆషాఢ మాసంలో వర్షాలు ప్రారంభమై వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది. ఈ కాలంలో జీర్ణక్రియ మందగించడం, అంటువ్యాధులు వ్యాపించడం సహజం. శారీరక కలయిక వల్ల శక్తి వ్యయం కాకుండా, ప్రకృతి మార్పులకు అనుగుణంగా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఈ సమయం ఉపయోగపడుతుంది.

3 / 5
మానసిక బంధం బలపడటం: కొత్తగా పెళ్లయిన అమ్మాయి అప్పటివరకు పెరిగిన పుట్టింటిని వదిలి అత్తగారింటికి వస్తుంది. అక్కడ కొత్త వాతావరణానికి అలవాటు పడే క్రమంలో కాస్త ఒత్తిడికి గురవుతుంది. అందుకే, ఈ నెల రోజులు పుట్టింటికి వెళ్లడం వల్ల ఆమెకు మానసిక ప్రశాంతత దొరుకుతుంది. అటు భర్తకు కూడా భార్య విలువ తెలిసి, వారి మధ్య ప్రేమ మరింత పెరుగుతుందని నమ్ముతారు.

4 / 5
మన పూర్వీకులు ఏ ఆచారాన్ని కూడా ఊరికే చెప్పలేదు. ఆషాఢ మాసంలో కొత్త జంటను దూరంగా ఉంచడం వెనుక ఉన్నది మూఢనమ్మకం కాదు.. కాబోయే తల్లి, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం పట్ల ఉన్న శ్రద్ధ మాత్రమే. కాబట్టి, ఈ ఆచారాన్ని శాస్త్రీయ కోణంలో అర్థం చేసుకుని గౌరవించడం ఎంతో మంచిది.

5 / 5
Follow Us
ఫౌల్ కోసం భారీ స్కెచ్.. రెఫరీ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్..!

ఆలయ గర్భగుడిలో ప్రత్యక్షమైన నాగన్న.. చివరకు ఏం జరిగిందో తెలుసా..?

రద్దీ రోడ్డుపై ఆరేళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్‌.. SI తాతపై కేసు

Video: కృత్రిమంగా పొదిగిన నాగుపాము గుడ్లు..!

ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు.. 140 లక్ష్యాలపై అటాక్..

అభిమాని కన్నీళ్లకు కరిగిపోయిన విజయ్ దేవరకొండ..

ఇంగ్లాండ్‌తో ప్రతీకార వన్డే సమరం.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే..?

పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ చేయడం మరింత సులువు.. కేంద్రం కొత్త సదుపాయం

భూమిపూజకు వచ్చి పరుగులు తీసిన ప్రజాప్రతినిధులు.. ఏం జరిగిందంటే?

ఉదయాన్నే రెండు స్పూన్లు తీసుకుంటే లైఫంతా జిల్ జిల్ జిగా జిగా..