AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD Caution Deposits: తిరుమల భక్తులు ఈ విషయాలను నమ్మొద్దు.. కాషన్‌ డిపాజిట్‌పై టీటీడీ క్లారిటీ

TTD Caution Deposits: తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. మన దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి భక్తులు..

TTD Caution Deposits: తిరుమల భక్తులు ఈ విషయాలను నమ్మొద్దు.. కాషన్‌ డిపాజిట్‌పై టీటీడీ క్లారిటీ
Tirumala Srivari Temple
Subhash Goud
|

Updated on: Aug 30, 2022 | 8:49 AM

Share

TTD Caution Deposits: తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. మన దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చి శ్రీవారిని దర్శించుకుంటారు. ఇక భక్తుల దర్శనానికి వచ్చే భక్తులు వసతి సదుపాయం కోసం ముందస్తుగా చెల్లించే కాషన్‌ డిపాజిట్‌ను తిరిగి చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వానికి మళ్లిస్తుందనే ఆరోపణలను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఖండించింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు చెల్లించే డిపాజిట్‌ను తిరిగి వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు దేవస్థానం బోర్డు స్పష్టం చేసింది. కాషన్‌ డిపాజిట్‌ విషయంలో భక్తులు ఇలాంటి అసత్య ప్రచారాలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని, కొందరు పనిగట్టుకుని ఇలాంటి ప్రచారాలు చేస్తూ భక్తులను ఆందోళనకు గురి చేస్తున్నారని తెలిపింది. సొమ్మును రాష్ట్ర ప్రభుత్వానికి మళ్లించడంలో భక్తుల ఖాతాల్లోకి ఆలస్యంగా చేరుతుందని, ఇలాంటి విషయాలను భక్తులు నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

కాషన్‌ డిపాజిట్‌ సొమ్ముపై అసత్య ప్రచారం చేసిన ఎమ్మెల్సీ బీటెక్‌ రవిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. వెంకన్న దర్శనానికి వచ్చే భక్తులు కరెంటు బుకింగ్‌, ఆన్‌లైన్‌ బుకింగ్‌ విధానంలో ముందస్తుగా గదులను బుక్‌ చేసుకుంటారు. భక్తులు గదులను ఖాళీ చేసిన తర్వాత రోజు మధ్యాహ్నం 3 గంటల్లోపు కాషన్‌ డిపాజిట్‌ సొమ్మును రిఫండ్‌ ఎలిజిబిలిటీ స్టేట్‌మెంట్‌ను అధీకృత బ్యాంకులైన ఫెడరల్‌ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులకు పంపుతున్నారు. సంబంధిత బ్యాంకు సిబ్బంది అదే రోజు అర్ధరాత్రి 12 గంటల్లోపు సంబంధిత మర్చంట్‌ సర్వీసెస్‌కు పంపుతారు. సెలవు దినాల్లో ఇలా చేయలేరు. మర్చంట్‌ సర్వీసెస్‌ మరుసటి రోజు వారి డబ్బును వారి ఖాతాల్లో జమ చేస్తారు.

అయితే కాషన్‌ డిపాజిట్‌ డబ్బులు చెల్లించిన బ్యాంకులు, తిరిగి భక్తుల ఖాతాల్లో జమ చేయడం జాప్యం అవుతుందని టీటీడీ అధికారులు గుర్తించారు. అయితే ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. బ్యాంకు ఏడు రోజుల పని దినాల్లో కాషన్‌ డిపాజిట్‌ భక్తుల ఖాతాల్లో రీఫండ్‌ చేయాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం జులై 11 నుంచి నాలుగైదు రోజుల్లో రీఫండ్‌ చేసేలా టీటీడీ చర్యలు చేపట్టింది. కొంతమంది కావాలని లేనిపోనివి సృష్టించి టీటీడీపై దుష్ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మవద్దని టీటీడీ కోరింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తిరుమల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి