AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirupati: తిరుమల కొండనిండా జనం.. శ్రీవారి దర్శనం కావాలంటే ఎన్ని రోజులో తెలుసా?

వరుస సేలవుల నేపథ్యంలోనే స్వామివారి తిరుమల శ్రీవారి సన్నిదికి భక్తులు పోటెత్తారు. దీంతో తిరుమల కొండ భక్తులతో తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది.. శుక్రవారం నుంచి కొనసాగుతున్న భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతోంది. శ్రీవారి సర్వ దర్శనం భక్తులకు గగనం అవుతుంది. టోకెన్ లేని భక్తులు స్వామివారిని సర్వదర్శనం చేసుకోవాలంటే 48 గంటల సమయం పడుతుందని టిటిడి ప్రకటించింది.ఆక్టోపస్ బిల్డింగ్ సర్కిల్ వరకు ఉన్న భక్తుల క్యూ లైన్ అలానే కొనసాగుతోంది. 

Tirupati: తిరుమల కొండనిండా జనం.. శ్రీవారి దర్శనం కావాలంటే ఎన్ని రోజులో తెలుసా?
Tirumala
Raju M P R
| Edited By: Anand T|

Updated on: Aug 16, 2025 | 11:47 PM

Share

తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది.. శుక్రవారం నుంచి కొనసాగుతున్న భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతోంది. శ్రీవారి సర్వ దర్శనం భక్తులకు గగనం అవుతుంది. టోకెన్ లేని భక్తులు స్వామివారిని సర్వదర్శనం చేసుకోవాలంటే 48 గంటల సమయం పడుతుందని టిటిడి ప్రకటించింది. ఆక్టోపస్ బిల్డింగ్ సర్కిల్ వరకు ఉన్న భక్తుల క్యూ లైన్ అలానే కొనసాగుతోంది. క్యూలైన్లోకి భక్తులు చేరుతూనే ఉండడంతో రద్దీ ఇలాగే కొనసాగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. శుక్రవారం 77,043 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా హుండీ ఆదాయం రూ 3.53 కోట్లు వచ్చింది. శనివారం ఉదయం నుంచి వైకుంఠం 2, నారాయణగిరి షెడ్ల లో నిండిపోయిన భక్తులు ఆక్టోపస్ బిల్డింగ్ సర్కిల్ వరకు ఉన్న భక్తుల క్యూ లైన్ కొనసాగుతూనే ఉంది.

వారాంతం మరోవైపు వరుస సెలవులతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేసిన అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు చేస్తోంది. అయితే వసతి దర్శనం విషయంలో ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉంది. ఎంత త్వరగా భక్తులకు దర్శనం చేయించాలన్న పరిస్థితులు అనుకూలించని పరిస్థితి నెలకొంది. అంతకంతకు భక్తులు క్యూ లైన్ లో కి చేరుకుంటుండడంగా గంటకు 4,500 మందికి భక్తులకు మాత్రమే దర్శనం చేయించగలుగుతున్నారు. క్యూలైన్లను క్రమబద్ధీకరించడం, భక్తులకు అన్న పానీయాలు సౌకర్యాలు కల్పించడంలో టిటిడి సక్సెస్ అవుతున్నా.. భక్తులకు అవసరం మేర వసతి కల్పించడం, సర్వదర్శనం రోజుల తరబడి కాకుండా కొన్ని గంటల వ్యవధిలోనే చేయించడం సాధ్యం కాకపోతోంది.

భక్తులకు తగ్గట్లుగా ఏర్పాట్లు సౌకర్యాలు కల్పిస్తున్న టిటిడి క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో నిరంతరాయంగా శ్రీవారి సేవకుల ద్వారా అన్న పానీయాలు పంపిణీ చేస్తుంది. భక్తుల రద్దీ, క్యూలైన్లు దర్శన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న టీటీడీ ఉన్నతాధికారులు.. తిరుమల కొండ భక్తులతో కిటకిట లాడుతుండడంతో శ్రీవారి సర్వదర్శనానికి రెండ్రోజుల సమయం పడుతోందని సహకరించాలని విజ్ఞప్తి చేస్తుంది. నందకం గెస్ట్ హౌస్ నుంచి ఆక్టోపస్ సర్కిల్ వరకు స్వామి వారి దర్శనానికి 48 గంటలు పడుతుందని అనౌన్స్మెంట్ చేస్తోంది. దాదాపు 5 కిలోమీటర్ల మేర భక్తుల క్యూ లైన్ ఉండగా వైకుంఠం 2 లోని 31 కంపార్ట్మెంట్లు, 9 నారాయణగిరి షెడ్లు నిండి ఆల్వార్ ట్యాంకు నుంచి ఆక్టోపస్ బిల్డింగ్ సర్కిల్ వరకు భక్తుల క్యూ లైన్ కంటిన్యూ అవుతోంది.

మరోవైపు స్వామివారి దర్శనానికి 48 సమయం పడుతుందని కొందరు భక్తులు వెనుతిరిగి పోతున్న పరిస్థితి ఏర్పడింది. స్వామి దర్శనమే కాకుండా తిరుమల కొండ పై వసతి దొరకక కూడా భక్తుల ఇబ్బందులు పడుతున్నారు. తిరుమలలో 7500 గదులు నాలుగు పీఏసీ సెంటర్లు భక్తులకు అందుబాటులో ఉండగా కొండపై ఉన్న రద్దీకి ఇవి ఏమాత్రం సరిపోని పరిస్థితి నెలకొంది. దీంతో ఒకవైపు వర్షం కురుస్తుండటంతో భక్తులకు ఇబ్బందులు తప్పని పరిస్థితి నెలకొంది. తిరుమల శ్రీవారి ఆలయ ముందు, మాడవీధుల నిండా భక్తులు ఉండిపోగా శ్రీవాణి భక్తులకు కూడా ఇబ్బందులు తప్పని పరిస్థితి ఏర్పడింది. కౌంటర్ వద్ద వసతులు లేకపోవడంతో అవస్థలు పడ్డ భక్తులు తెల్లవారు జామున శ్రీవాణి కౌంటర్ వద్ద టిక్కెట్లు దొరక్క ఆందోళనకు దిగిన పరిస్థితి ఏర్పడింది. తిరుమలలోని శ్రీవాణి కౌంటర్స్ లో ఆఫ్ లైన్ 800 టికెట్లను జారీ చేస్తున్న టీటీడీ నిర్దేశించిన సమయంలో టికెట్లు జారీ చేయకపోవడంతో భక్తుల్లో గందరగోళానికి కారణమైంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.