Tirupati: తిరుపతిలో బాంబు బెదిరింపులు.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..

తిరుపతిలోని హోటళ్లకు పాక్ ఐఎస్ఐ ఉగ్రవాదుల నుంచి వచ్చిన బెదిరింపు మెయిల్స్ కలకలం రేపాయి. తిరుపతిలోని ప్రముఖ హోటల్స్‌కి ఓకే సమయంలో వచ్చిన మెయిల్స్ వార్నింగ్ ఆందోళనకు గురిచేసింది. ఈ మేరకు హోటల్స్‌కు వచ్చిన మెయిల్స్ ఆధారంగా యాజమాన్యాలు పోలీసులకు సమాచారం ఇచ్చాయి.

Tirupati: తిరుపతిలో బాంబు బెదిరింపులు.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..
Threatening Mails In Tirupati
Follow us
Raju M P R

| Edited By: Velpula Bharath Rao

Updated on: Oct 25, 2024 | 7:06 AM

ఆధ్యాత్మిక నగరం తిరుపతిలోని హోటళ్లకు పాక్ ఐఎస్ఐ ఉగ్రవాదుల నుంచి వచ్చిన బెదిరింపు మెయిల్స్ కలకలం రేపాయి. తిరుపతిలోని ప్రముఖ హోటల్స్‌కి ఓకే సమయంలో వచ్చిన మెయిల్స్ వార్నింగ్ ఆందోళనకు గురిచేసింది. రేణిగుంట రోడ్డులోని రెగాలియా, తిరుమల బైపాస్ పాయి వైస్రాయ్, రినెస్ట్, చెన్నై రాజ్ పార్క్ హోటల్స్‌కు బ్లాస్ట్ చేస్తామన్న బెదిరింపు మెయిల్స్ మెసేజ్‌లతో ఆయా హోటల్స్ యాజమాన్యాలు ఆందోళనకు గురైయ్యాయి. ఈ మేరకు హోటల్స్‌కు వచ్చిన మెయిల్స్ ఆధారంగా పోలీసులకు సమాచారం ఇచ్చాయి. రిగాలియా హోటల్ మెయిల్ ఐడీకి వచ్చిన బెదిరింపు సమాచారంపై ఈస్ట్ పీఎస్‌లో ఆ హోటల్ యండి శ్రీకాంత్ రెడ్డి ఫిర్యాదు చేసారు. ఈ మేరకు తిరుపతి ఈస్ట్ పీఎస్‌లో కేసు నమోదు కాగా లీలా మహల్ జంక్షన్ సమీపంలోని రినెస్ట్ హోటల్ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు అలిపిరి పీఎస్‌లో కేసు నమోదైంది.

అప్రమత్తమైన పోలీసులు ఆయా హోటల్స్‌లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. అర్ధరాత్రి దాకా బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో అణువణువు తనిఖీలు నిర్వహించారు. హోటల్స్‌లోని రెస్టారెంట్లు, సెల్లార్స్‌లో పార్కింగ్ ఏరియాలతో పాటు హోటల్ గదుల్లో ఉన్న వారిని బయటకు పంపి తనిఖీలు చేపట్టారు. రాత్రంతా తనిఖీలు నిర్వహించిన పోలీసులు బెదిరింపు మెయిల్స్ ఫేక్ అని నిర్ధారించుకుని ఊపిరి పీల్చుకున్నాను. గత ఆరు నెలల క్రితం ఢిల్లీలో పట్టుబడ్డ డ్రగ్స్ కేసుకు ఈ బ్లాస్ట్ మెయిల్స్ సంబంధం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. డ్రగ్స్ వ్యవహారంలో కీలక నిందితుడుగా ఉన్న చెన్నైకి చెందిన ఒక సినీ ప్రముఖుడి కేసుకు సంబంధించి ఈ మెయిల్స్ వచ్చాయన్న అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు మెయిల్ ఐడీలను పరిశీలిస్తున్నారు. ఈ మేరకు సైబర్ టీం రంగంలో దిగింది. పాక్ ఐఎస్ఐ ఉగ్రవాదుల నుంచి బ్లాస్టింగ్ మెయిల్స్ రావడం, ఈ వార్త అంతటా వైరల్ కావడం, అర్ధరాత్రి దాకా హోటల్స్‌లో సోదాలు కొనసాగడంతో టెంపుల్ సిటీలో హడావుడి ఆందోళన నెలకొంది. గతి కొద్ది రోజుల కిత్రం తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ కల్తీ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారితే.. ఇప్పుడు బెదిరింపు మెయిల్స్‌తో తిరుపతి మళ్లీ వార్తలో నిలిచింది.

పోలీసులు తనిఖీలు చేస్తున్న వీడియో:

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే