AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dil Raju: తిరుమల శ్రీవారి సేవలో దిల్ రాజు.. స్వామి వారికి తలనీలాలు సమర్పణ.. వీడియో చూడండి

దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తోన్న గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది. ఎప్పటినుంచో షూటింగ్ జరుపుకొంటోన్న ఈ సినిమా రిలీజ్ కోసం మెగాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Dil Raju: తిరుమల శ్రీవారి సేవలో దిల్ రాజు.. స్వామి వారికి  తలనీలాలు సమర్పణ.. వీడియో చూడండి
Dil Raju Family
Basha Shek
|

Updated on: Oct 24, 2024 | 5:43 PM

Share

టాలీవుడ్‌ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం (అక్టోబర్ 24) ఉదయాన్నే ఆయన శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భార్య, కుమారుడితో కలిసి తిరుమలకు వెళ్లిన ఆయనకు ఆలయాధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం శ్రీనివాసుడి దర్శనం చేయించిన పూజారులు స్వామి వారి తీర్థ, ప్రసాదాలు అందజేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా దిల్ రాజు మొదటి భార్య అనిత చనిపోవడంతో 2020లో తేజస్విని అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక బాబు ఉన్నాడు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే దిల్ రాజు నిర్మించిన ఫ్యామిలీ స్టార్, లవ్ మీ సినిమాలు అభిమానులను నిరాశపర్చాయి. అలాగే దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హర్షిత్, హన్షిత నిర్మించిన జనక అయతే గనక కూడా యావరేజ్ గా నే నిలిచింది. దీంతో ప్రస్తుతం దిల్ రాజు ఆశలన్నీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాపైనే ఉన్నాయి.

సౌతిండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ గేమ్ ఛేంజర్ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ నటించింది. ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకొంటోన్న ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ లోనే రిలీజ్ కావాల్సి ఉంది. అయితే చిరంజీవి విశ్వంభర పొంగల్‌ పోటీ నుంచి తప్పుకోవడంతో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ తో సంక్రాంతికి రెడీ అయ్యాడు. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్‌ సంగీతమందించారు. కార్తీక్ సుబ్బరాజు కథ అందించారు.ఇందులో అంజలి, శ్రీకాంత్, ఎస్ జే సూర్య, సునీల్, సముద్ర ఖని, ప్రకాశ్ రాజ్ , నాజర్, శుభలేఖ సుధాకర్, నవీన్ చంద్ర, రాజీవ్ కనకాల, మురళీ శర్మ, సత్య, ప్రియదర్శి.. ఇలా పేరున్న స్టార్స్ నటిస్తున్నారు.  సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా గేమ్ ఛేంజర్ సినిమా విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

తిరుమలలో దిల్ రాజు ఫ్యామిలీ.. వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. చేయండి.