- Telugu News Photo Gallery Cinema photos Late Actor Nandamuri Taraka Ratna Daughter Nishka Half Saree Function Photos Goes Viral
Taraka Ratna: ఘనంగా తారకరత్న కూతురు హాఫ్ శారీ ఫంక్షన్.. ఫొటోస్ వైరల్
నందమూరి తారకరత్న పేరు వినగానే కన్నీళ్లు వచ్చేస్తాయి. నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమై ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కాగా 39ఏళ్లకే గుండెపోటుతో కన్నుమూశారు తారకరత్న.
Updated on: Oct 24, 2024 | 5:36 PM

తన నటనతో హీరోగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు నందమూరి హీరో తారకరత్న. నందమూరి ఫ్యామిలి నుంచి వచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి ఫ్యాన్ బేసి క్రియేట్ చేసుకున్నారు తారక్ రత్న.

తారకరత్న 2001లో ఒకేసారి 9 సినిమాలు మొదలు పెట్టి వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. 2002లో విడుదలైన ఒకటో నంబర్ కుర్రాడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు తారక రత్న. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

2023 జనవరి 27న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభమవగా అందులో పాల్గొన్న తారకరత్న సొమ్మసిల్లి పడిపోయాడు. గుండెపోటు రావడంతో తారకరత్న పడిపోయారు.

ఆతర్వాత చికిత్స పొందుతున్న 39 ఏళ్ళ తారకరత్న 2023 ఫిబ్రవరి 18 మహాశివరాత్రి పర్వదినాన కన్నుమూశారు. ఆయన మరణంతో నందమూరి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. తారకరత్నకు ఇద్దరు కూతుర్లు ఓ కొడుకు ఉన్నారు.

తాజాగా తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి తన పెద్ద కూతురు నిష్క హాఫ్ శారీ ఫంక్షన్ ని ఘనంగా నిర్వహించారు. ఇందుకు సంబదించిన ఫోటోలను అలేఖ్య సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.





























