- Telugu News Photo Gallery Cinema photos Do You Know The Heroine Who Is Beside With Actor Nani, Her Name is Drishty Talwar
Tollywood: అమ్మ బాబోయ్.. ఈ బ్యూటీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే.. ఆ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్..
ప్రస్తుతం సోషల్ మీడియా ఎంతో మందికి గుర్తింపు తెచ్చిపెట్టింది. ముఖ్యంగా చాలామంది అమ్మాయిలకు సినీరంగంలోకి అడుగులు వేసేలా చేసింది. ఇన్ స్టాలో రీల్స్, డాన్స్ వీడియోస్ చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. దీంతో ఇన్ స్టా ప్రొఫైల్ చూసి నేరుగా హీరోయిన్ ఎంపిక కూడా చేస్తున్నారు. అలాంటి వారిలో ఈ అమ్మడు ఒకరు.
Updated on: Oct 24, 2024 | 11:12 AM

నానితో కలిసి ఉన్న ఈ అమ్మాయి పేరు దృష్టి తల్వార్. ఢిల్లీకి చెందిన ఈ బ్యూటీ 1998 ఆగస్ట్ 30న జన్మించింది. ముందుగా టిక్ టాక్ వీడియోస్, ఆ తర్వాత యూట్యూబ్ వీడియోస్, ఇన్ స్టాలో రీల్స్ చేసి చాలా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది.

2022లో పంజాబీ చిత్రం చోబ్బర్ తో సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఓవైపు పంజాబీ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ మరోవైపు సోషల్ మీడియాలో తనకంటూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ఇక అదే క్రేజ్ తో ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. న్యాచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇందులో మృణాల్ ఠాకూర్ చెల్లి పాత్రలో కనిపించింది. అలాగే ఈ అమ్మడు ప్రైవేట్ సాంగ్స్ కూడా చేసింది.

తాజాగా ఫ్లై అనే పంజాబీ పాటలో కనిపించింది ఈ వయ్యారి.. ప్రస్తుతం ఆమె ఇన్ స్టాలో 139 కే ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్, వీడియోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. దీంతో ఈ అమ్మడు గురించి సెర్చింగ్ స్టార్ట్ చేశారు ఫ్యాన్స్.

హాయ్ నాన్న సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇందులో మృణాల్, నాని యాక్టింగ్ కు జనాలు ఫిదా అయ్యారు. అలాగే ఈ చిత్రంలో మృణాల్ చెల్లిగా కనిపించి స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది దృష్టి తల్వార్.




