కాటుక కళ్ళు .. కవ్వించే నవ్వు.. అందానికి ఆధార్ కార్డు ప్రియాంక మోహన్
తమిళంలో ధనుష్ సరసన కెప్టెన్ మిల్లర్ చిత్రంలో ప్రియాంక మోహన్ నటించింది. ధనుష్ కెప్టెన్ మిల్లర్‌లో ఫైటర్‌గా ఎప్పుడూ చనువుగా ఉండే ప్రియాంక మోహన్ నటించనుంది. ఈ చిత్రం అభిమానుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకుంది.
Updated on: Oct 24, 2024 | 8:02 AM

ప్రియాంకా అరుళ్ మోహన్.. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ చిన్నది. తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది . అందం అభినయం ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతోంది.

ఈ ముద్దుగుమ్మ తెలుగు తమిళం,కన్నడ భాషల్లోని సినిమాల్లో నటించింది. తెలుగులో గ్యాంగ్ లీడర్ సినిమా తర్వాత శర్వానంద్ తో కలిసి శ్రీకారం అనే సినిమా చేసింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.

ప్రియాంక 1994 నవంబరు 20లో తమిళనాడు రాష్ట్రం చెన్నైలో పుట్టింది. ఆమె చదువంతా చెన్నైలో పూర్తి చేసింది. ఆమె సినిమాల్లోకి రాకముందు థియేటర్ ఆర్ట్స్ చేసింది. బెంగుళూరులో స్టేజ్ షోల్లో పాల్గొన్నది.

రీసెంట్ గా నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం సినిమాతో హిట్ అందుకుంది ఈ అమ్మడు. ఈ సినిమా తర్వాత తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమాలోనూ నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను కవ్విస్తుంది. తాజాగా ఈ భామ బ్లాక్ కలర్ చీరలో అదిరిపోయే ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.





























