AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోలీసులపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు, వీళ్ల ఉద్యోగాలు గోవిందా.. గోవింద! అంటూ ఎద్దేవా

TDP chief on Police : ఆంధ్రప్రదేశ్ పోలీసులపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు...

పోలీసులపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు, వీళ్ల ఉద్యోగాలు గోవిందా.. గోవింద! అంటూ ఎద్దేవా
Venkata Narayana
|

Updated on: Apr 10, 2021 | 11:08 PM

Share

TDP chief on Police : ఆంధ్రప్రదేశ్ పోలీసులపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. అన్ని రాజకీయ పార్టీలను సమానంగా చూడకపోతే వీళ్ల ఉద్యోగాలు గోవిందా గోవింద! అంటూ ఎద్దేవా చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశాను. పోలీసులు మీరు కూడా చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించండి. రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసి కష్టాల్లో పడవద్దని పోలీసు వ్యవస్థకు విజ్ఞప్తి చేస్తున్నా.. అంటూ చంద్రబాబు రోడ్ షోలో హెచ్చరించారు. తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి తరఫున ప్రచారం నిర్వహిస్తూ నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ పోలీసులపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఇప్పుడు తన ప్రచారం సందర్భంగానూ పోలీసులు వచ్చారని, మొన్న పంచాయతీ ఎన్నికల్లో ఇదే పోలీసులు విర్రవీగారని చంద్రబాబు ఆరోపించారు.

“ఎమ్మెల్యేలు ఏది చెబితే అది చేశారు ఈ పోలీసులే. నామినేషన్లు వేయనివ్వకుండా బెదిరించింది కూడా ఈ పోలీసులే. నామినేషన్లు వేస్తే ఉపసంహరించుకునేలా చేసి బలవంతపు ఏకగ్రీవాలు అయ్యేలా చేసింది కూడా ఈ పోలీసులే. ఎన్నికలయ్యాక రాత్రిపూట కరెంట్ తీసి వైసీపీకి అనుకూలంగా ఫలితాలను మార్చింది ఈ పోలీసులే. ఆ రోజున అన్ని చేసిన పోలీసులు ఈ రోజున ఏమీ చేయడంలేదు… ఎందుకని అంటే… ఈ పార్లమెంటు స్థానం ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది కాబట్టి.” అని చంద్రబాబు అన్నారు.

Read also : Telangana Corona : తెలంగాణకు కోవిడ్ 19 వ్యాక్సిన్ డోసులు అర్జెంటుగా పంపించండి.. కేంద్రమంత్రికి చీఫ్ సెక్రటరీ లేఖ