AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD: టీటీడీ భక్తులకు గుడ్‌న్యూస్.. అలిపిరిలో ఎయిర్ పోర్ట్‌ తరహా చెక్‌ పాయింట్స్‌.. తనిఖీల పేరుతో ఆలస్యానికి చెక్!

తిరుమల తిరుపతి దేవస్తానికి వచ్చే భక్తులు అలిపిరి చెక్‌ పాయింట్‌ వద్ద ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేలా చర్యలు చేపడుతోంది టీటీడీ. ఇందులో భాగంగానే ఆధునిక సౌకర్యాలతో అలిపిరి టోల్ ప్లాజా పునరుద్ధరణకు చర్యలు ప్రారంభించనుంది. ఈ క్రమంలోనే అలిపిరి చెక్ పాయింట్ ఆధునీకరణతో పాటు భద్రత పెంచేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది.

TTD: టీటీడీ భక్తులకు గుడ్‌న్యూస్.. అలిపిరిలో ఎయిర్ పోర్ట్‌ తరహా చెక్‌ పాయింట్స్‌.. తనిఖీల పేరుతో ఆలస్యానికి చెక్!
Alipiri Check Post
Raju M P R
| Edited By: Anand T|

Updated on: Jun 24, 2025 | 3:45 AM

Share

శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల తాడికి రోజురోజుకూ పెరుగుండడంతో అలిపిరి వద్ద వాహనాల రద్దీ తోపాటు తనిఖీ సమయాన్ని తగ్గించే అంశంపై టీడీపీ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే అలిపిరి టోల్ ప్లాజాను ఆధునికరించే చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు టోల్‌ ప్లాజా వద్ద అందుబాటులోకి తేబోయే ఆధునిక సౌకర్యాలు, పటిష్ట భద్రత అంశాలపై జిఎంఆర్ గ్రూప్‌కు చెందిన రాక్సా సంస్థ ఇప్పటికే టీటీడీ అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చింది. భక్తుల చెకింగ్, లగేజీ స్కానింగ్‌కు ప్రస్తుతం తీసుకుంటున్న సమయం, దాని వల్ల వస్తున్న సమస్యలపై అధికారులతో చర్చించిన టిటిడి.. భక్తులకు అసౌకర్యం కలగ కుండా వేగంగా వాహనాలు, లగేజీ స్కానింగ్ చేసేందుకు చర్యలు చేపట్టాలని తెలిపింది.

తిరుపతికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. దీంతో టీటీడీకి వచ్చే భక్తులను చెక్‌ చేసి అనుమతించడంతో అలిపిరి చెక్ పాయింట్ వద్ద నిత్యం వాహనాలు రద్దీ కొనసాగుతుంది. ఈ చెక్‌ పాయింట్‌ వద్ద సుమారు రోజుకు 10 వేలకు పైగా వాహనాల తనిఖీ జరుగుతోంది. భక్తుల లగేజీ, వాహనాల స్కానింగ్‌లో కొనసాగుతున్న జాప్యంపై దృష్టి పెట్టిన టీటీడీ ఈ మేరకు సమస్యను అధిగమించేందుకు చర్యలు చేపట్టింది. ఎయిర్‌పోర్టుల వద్ద వాహనాలు తనిఖీ చేసే తరహాలోనే అలిపిరి చెక్‌ పాయింట్‌ వద్ద కూడా వాహనాల తనిఖీ జరిపేలా ఆధునిక సౌకర్యాలను టిటిడి అందుబాటులోకి తీసుకరానుంది.

అంతే కాకుండా ఇప్పుడున్న 12 లైన్ల తనిఖీ పాయింట్లను విస్తరించి మరిన్ని తనిఖీలైన్లను అందుబాటులో తీసుకురానుంది. తనిఖీ సమయంలో క్రాస్ ఓవర్‌లను నివారించేందుకు చర్యలు చేపట్టాలని టీటీడీ భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న లగేజ్ స్కానర్‌ల స్థానంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్కానర్లు ఏర్పాటు చేయనుంది. లగేజ్ స్కానింగ్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు లగేజ్ స్కానర్‌లను పెంచాలని భావిస్తున్న టీటీడీ లగేజ్ కన్వేయర్ బెల్ట్‌ లను పెంచి భద్రతా తనిఖీలో సమయాన్ని నివారించే అంశం పరిశీలిస్తోంది. అలిపిరి టోల్ ప్లాజాలో మరింత మంది భద్రతా సిబ్బందిని నియామించేందుకు కసరత్తు చేస్తోంది.

రాబోయే రెండు దశాబ్దాల పాటు భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక భద్రతా అంశాలపై ఫోకస్ పెట్టింది టిటిడి. భక్తుల వాహనాలు, లగేజీ ని తక్కువ సమయంలో స్కాన్ చేయడం వల్ల సమయం ఆదా అవుతుందని భావిస్తున్నటీటీడీ.. టోల్ ప్లాజాలో శాస్త్రీయంగా స్కానింగ్ చేసేలా సాంకేతిక పరిజ్ఞానం, క్యూ మేనేజ్మెంట్, భద్రత, సెక్యూరిటీ సిబ్బందికి శిక్షణ, అత్యాధునిక సిసి కెమెరాల ఏర్పాటు, మౌళిక సదుపాయాలను కల్పించాలని నిర్ణయించింది. అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ లలో స్కానింగ్ చేసి లగేజీ ని జాగ్రత్తగా అందిస్తున్న అంశాలను పరిశీలిస్తున్న టిటిడి, యాత్రికుల లగేజీని డిపాజిట్ చేసి తిరుమల చేరుకునే సమయానికి లగేజీ సమాచారాన్ని భక్తులకు అందించే అంశంపై కూడా కసరత్తు చేస్తోంది.

మరిన్ని అంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..