Prakash Raj: ఇక ప్రజల కోసం చేయాల్సిన పనులు చూడండి.. ప్రకాష్ రాజ్ మరో సంచలన ట్వీట్
ఓ సినిమా ఫ్యాక్షన్స్ లో లడ్డు గురించి హీరో కార్తీ మాట్లాడటం దానిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించడం.. ఆ తర్వాత కార్తీ క్షమాపణలు చెప్పడం.. మళ్లీ దాని పై పవన్ స్పందించడం జరిగింది. ఇదిలా ఉంటే ప్రకాష్ రాజ్ పై కూడా పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ప్రకాష్ రాజ్‌కు ఏంటి సంబంధం అంటూ పవన్ వ్యాఖ్యానించారు.
లడ్డు వివాదం రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు దేశవ్యాప్తంగా చేర్చకు దారితీసింది. లడ్డులో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందంటూ ప్రభుతం ఆరోపించడంతో దీని పరి సర్వత్రా చర్చ జరిగింది. చాలామంది లడ్డు వివాదం పై స్పందించారు. పలువురు సినీ సెలబ్రెటీలు కూడా దీని పై స్పందించారు. ఓ సినిమా ఫ్యాక్షన్స్ లో లడ్డు గురించి హీరో కార్తీ మాట్లాడటం దానిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించడం.. ఆ తర్వాత కార్తీ క్షమాపణలు చెప్పడం.. మళ్లీ దాని పై పవన్ స్పందించడం జరిగింది. ఇదిలా ఉంటే ప్రకాష్ రాజ్ పై కూడా పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ప్రకాష్ రాజ్‌కు ఏంటి సంబంధం అంటూ పవన్ వ్యాఖ్యానించారు. దాంతో ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
“నేను విదేశాల్లో షూటింగ్ లో ఉన్నాను త్వరలోనే వస్తా.. అన్ని మాటలకూ సమాధానం చెప్తాను” అని అన్నారు. అప్పటి నుంచి ఆయన వరుసగా ట్వీట్స్ చేస్తూ వస్తున్నారు. తాజాగా ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. “కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ..! కదా..? ఇక చాలు.. ప్రజలకోసం చేయలేసిన పనులు చూడండి” అని రాసుకొచ్చారు ప్రకాష్ రాజ్.
ఇదిలా ఉంటే లడ్డు వివాదం పై దాఖలైన పిటీషన్ పై సుప్రీం కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా వాదనలు విన్న దర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ పూర్తి కాకుండా.. లడ్డు నెయ్యిలో కల్తీ జరిగిందని ఆరోపణలు చేయడం సరికాదు అని కోర్టు తెలిపింది. కల్తీ నెయ్యిని లడ్డూ తయారీలో వాడారా..? అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది.. లడ్డూ నాణ్యత లేదని భక్తులు ఫిర్యాదు చేశారని.. ప్రభుత్వ న్యాయవాది లూథ్రా వివరించారు.. తయారైన లడ్డూలని టెస్టింగ్‌కు పంపించారా..? అనుమానం ఉంటే రెండో అభిప్రాయం తీసుకుంటాం కదా.. తిరస్కరించిన నెయ్యిలో మీరు చెప్పిన అవశేషాలు ఉన్నాయా….? అంటూ ధర్మాసనం ప్రశ్నించింది.
కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ ! .. కదా ?. … ఇక చాలు… ప్రజల కోసం చెయ్యవలసిన పనులు చూడండి … Enough is Enough .. Now will you please focus on what is important to the Citizens.. #justasking
— Prakash Raj (@prakashraaj) October 1, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి