వీళ్లు మామూలోళ్లు కాదు.. మత్తు ఇంజక్షన్ ఇచ్చి కిడ్నాప్ చేశారు.. చివరకు ఏం జరిగిందంటే..

ఎలాగైనా డబ్బు సంపాదించాలని అనుకున్నారు.. పక్కా ప్లాన్ రచించారు. ఓ వ్యక్తిని టార్గెట్ చేసి కిడ్నాప్ చేశారు.. అనంతరం అతని కొడుకుకు ఫోన్ చేసి రూ.5కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.. చివరకు పోలీసులు ఎంటర్ అవ్వడంతో నిందితులు అడ్డంగా దొరికిపోయారు. పోలీసులు సినీ ఫక్కిలో కిడ్నాపర్లను పట్టుకుని.. నలుగురిని కటకటాల వెనక్కి పంపించారు.

వీళ్లు మామూలోళ్లు కాదు.. మత్తు ఇంజక్షన్ ఇచ్చి కిడ్నాప్ చేశారు.. చివరకు ఏం జరిగిందంటే..
Crime News
Follow us
Raju M P R

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jul 29, 2024 | 5:32 PM

ఎలాగైనా డబ్బు సంపాదించాలని అనుకున్నారు.. పక్కా ప్లాన్ రచించారు. ఓ వ్యక్తిని టార్గెట్ చేసి కిడ్నాప్ చేశారు.. అనంతరం అతని కొడుకుకు ఫోన్ చేసి రూ.5కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.. చివరకు పోలీసులు ఎంటర్ అవ్వడంతో నిందితులు అడ్డంగా దొరికిపోయారు. పోలీసులు సినీ ఫక్కిలో కిడ్నాపర్లను పట్టుకుని.. నలుగురిని కటకటాల వెనక్కి పంపించారు. కిడ్నాప్ చేయడానికి ఉపయోగించిన నకిలీ పిస్టల్, మత్తుమందు ఇంజక్షన్లు, రెనాల్ట్ ట్రైబెర్ వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఇలా తిరుపతి జిల్లాలో కిడ్నాప్ కథ సుఖాంతమైంది. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు కిడ్నాప్ కు సంబంధించిన వివరాలను సోమవారం వెల్లడించారు. చిన్న గొట్టిగల్లు మండలం చెరువు ముందరపల్లి గ్రామానికి చెందిన జంగం భాస్కర్ ఈ నెల 24న ఉదయం కిడ్నాప్ నకు గురయ్యాడు. భాకరాపేట ఘాట్ రోడ్డులోని పెట్రోల్ బంకు సమీపములో ఆటోలో వెళుతుండగా కిడ్నాపర్లు నకిలీ తుపాకీ చూపి బెదిరించి కిడ్నాప్ చేశారు. గొడవ చేస్తాడన్న భయంతో మత్తు ఇంజక్షన్ ఇచ్చి కిడ్నాప్ చేసారు. భాదితుడు వద్దనున్న మొబైల్ నుంచి కొడుకు రెడ్డి కిరణ్ కు ఫోన్ చేసి రూ 5 కోట్లు డిమాండ్ చేశారు. అంత మొత్తం లేదని చెప్పడంతో.. చివరకు రూ.1.50 కోటి ఇవ్వాలని, లేదంటే జంగం భాస్కర్ ను చంపుతామని కిడ్నాపర్లు బెదిరించారు. దీంతో తండ్రి కిడ్నాప్ విషయాన్ని కొడుకు కిరణ్ భాకరాపేట పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు.. అనంతరం ఎస్పీ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ కులశేఖర్ పర్యవేక్షణలో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం 7 గంటల సమయంలో భాకరాపేట ఘాట్ రోడ్డులోని ఊర్జా హోటల్ వద్ద కిడ్నాపర్లను గుర్తించారు పోలీసులు.

ఈ క్రమంలో పోలీసులను గమనించిన కిడ్నాపర్లు అలర్ట్ అయ్యారు.. కారులో తప్పించుకునే ప్రయత్నంలో కిడ్నాపర్లు పోలీస్ వాహనాన్ని కూడా ఢీకొట్టారు. వాహనాన్ని చుట్టుముట్టిన పోలీసులు.. నలుగురు కిడ్నాపర్లను పట్టుకొనగా, మరో ఇద్దరు ఇర్ఫాన్, అంజి పారిపోయారు. పట్టుబడ్డ కిడ్నాపర్లు బెంగుళూరు, రొంపిచెర్ల, భాకరాపేట, రాయచోటి లలో పలు దొంగతనాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఎర్రచందనం కేసుల్లోనూ నిందితులుగా ఉన్నట్లు ఎస్పి సుబ్బరాయుడు చెప్పారు.

Tirupati Police

Tirupati Police

జంగం భాస్కర్ కిడ్నాప్ కోసం అదే గ్రామానికి చెందిన అంజి సాయం తీసుకున్న కిడ్నాపర్లు.. మత్తు ఇచ్చేందుకు డాక్టర్ షేక్ జాహిద్ బాషా హెల్ప్ తీసుకున్నారు. చిన్నగొట్టికల్లుకు చెందిన మహమ్మద్ జీషాన్, బెంగళూరులోని లింగరాజపురానికి చెందిన మహమ్మద్ ఖాసిఫ్, బెంగళూరు శివాజీ నగర్ కు చెందిన ఆర్కంఖాన్, కలికిరి మండలం మహల్ కు చెందిన షేక్ జాహిద్ బాషా లను అరెస్ట్ చేసి పోలీసు రిమాండ్ కు తరలించారు. కిడ్నాప్ కోసం వినియోగించిన రెనాల్ట్ కారు, నకిలీ తుపాకీ, మత్తు ఇంజక్షన్, భాదితుడు జంగం భాస్కర్ ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..