Andhra Pradesh: దివ్వెల మాధురి – దువ్వాడ శ్రీనివాస్‌కు బిగ్ షాక్.. 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు

శ్రీవారి ఆలయం దగ్గర ఇలాంటి పనులేంటి ? ఇక్కడ కూడా ఓవరాక్షన్ అవసరమా ? కొద్దిరోజుల క్రితం తిరుమలలో దువ్వాడ శ్రీనివాస్, దివ్వల మాధురి సందడి చూసిన వారిలో చాలామంది ఇదే అనుకున్నారు. కట్ చేస్తే ఇదే అంశంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) దివ్వల మాధురికి షాక్ ఇచ్చింది.

Andhra Pradesh: దివ్వెల మాధురి - దువ్వాడ శ్రీనివాస్‌కు బిగ్ షాక్.. 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు
Duvvada Srinivas - Madhuri:
Follow us
Raju M P R

| Edited By: Shaik Madar Saheb

Updated on: Oct 11, 2024 | 6:55 AM

శ్రీవారి ఆలయం దగ్గర ఇలాంటి పనులేంటి ? ఇక్కడ కూడా ఓవరాక్షన్ అవసరమా ? కొద్దిరోజుల క్రితం తిరుమలలో దువ్వాడ శ్రీనివాస్, దివ్వల మాధురి సందడి చూసిన వారిలో చాలామంది ఇదే అనుకున్నారు. కట్ చేస్తే ఇదే అంశంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) దివ్వల మాధురికి షాక్ ఇచ్చింది. ఆలయ పరిసరాల్లో రీల్స్ చేశారంటూ ఆమెపై కేసు నమోదు చేశారు. టీటీడీ ఫిర్యాదు మేరకు దివ్వెల మాధురిపై తిరుమలలో మూడు సెక్షన్ల కింద కేసు చేశారు పోలీసులు. ఇటీవల తిరుమలలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి మాధురి రీల్స్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఆలయం దగ్గర రీల్స్ చేయడంపై టీటీడీ అభ్యంతరం తెలిపింది. దీనిపై విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయ పరిసరాల్లో రీల్స్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో.. పోలీసులు కేసు నమోదు చేశారు.

నిబంధనలు ఉల్లంఘించారన్న తిరుమల డీఎస్పీ

తిరుమల మాడ వీధుల్లో వ్యక్తిగత విషయాలు మాట్లాడటం నిబంధనలకు విరుద్ధమన్నారు డీఎస్పీ విజయ్‌శేఖర్. దివ్వల మాధురి రీల్స్‌ చేయడంపై టీటీడీ ఫిర్యాదు చేసిందన్నారు. దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ విజయ్ శేఖర్ తెలిపారు. పవిత్రమైన తిరుమలలో దేవుడికి సంబంధించిన విషయాలు మాత్రమే మాట్లాడాలని.. వ్యక్తిగత విషయాలు మాట్లాడటం నిషేధమన్నారు.

ఎవియస్ఓ మనోహర్ ఇచ్చిన పిర్యాదు మేరకు మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆలయం వద్ద భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా దువ్వాడ శ్రీనివాస్ తో కలసి రీల్స్ చేయడం, వ్యక్తిగత విషయాలను పంచుకోవడం పట్ల భక్తుల నుంచి కూడా అభ్యంతరం వ్యక్తమైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. BNS 292, 296, 300 సెక్షన్స్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు తిరుమల ఆలయ మాడవీధుల్లో వ్యక్తిగత విషయాలు మాట్లాడడం రూల్స్ కు విరుద్ధమన్నారు.

కొద్దిరోజుల క్రితం దివ్వల మాధురితో పాటు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. అనంతరం వీరిద్దరు కలిసి మాడవీధుల్లో హల్ చల్ చేశారు. ఫోటోలకు ఫోజులిచ్చారు. తమ మధ్య ఉన్న సంబంధం గురించి వివరించారు. తాము ఇంకా పెళ్లి చేసుకోలేదని.. కోర్టుల్లో కేసులు కొలిక్కివచ్చాక పెళ్లి చేసుకుంటామని అన్నారు. అయితే తిరుమలలో ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం కావడంతో.. దివ్వల మాధురిపై కేసు నమోదైంది.

తిరుమలలో రీల్స్ చేయలేదన్న దువ్వాడ శ్రీనివాస్

అయితే తిరుమలలో తాము రీల్స్ చేశామనే ఆరోపణల్లో నిజం లేదని టీవీ9కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు దువ్వాడ శ్రీనివాస్. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లామని.. మాడవీధుల్లో తిరిగే సమయంలో కొందరు తమతో ఫోటోలు తీసుకున్నారని అన్నారు. అంతేతప్ప ఈ విషయంలో తాము తప్పు చేయలేదని వివరించారు.

మళ్లీ వివాదం

కొద్దిరోజుల క్రితం వరకు దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కలహాల కారణంగా కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా మారిన దివ్వల మాధురి.. ఇప్పుడు తిరుమలలో రీల్స్ చేశారంటూ ఆరోపణలు ఎదుర్కోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంలో పోలీసులు కేసు కూడా నమోదు చేయడంతో ఏం జరుగుతుందో చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే