జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ సోమవారం తిరుపతి వెళ్లనున్నారు. శ్రీకాళహస్తి ఘటనపై తిరుపతి ఎస్పీని కలిసి సీఐ అంజూ యాదవ్‌పై ఫిర్యాదు చేయనున్నారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పవన్ డిమాండ్ చేయనున్నారు. ఈమేరకు ఎస్పీకి వినతిపత్రం అందించనున్నారు జనసేన చీఫ్. దీనికి సంబంధించి జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘శ్రీకాళ హస్తిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న జనసేన నాయకుడు కొట్టె సాయిపై అమానుషంగా దాడి చేశారు సీఐ అంజూ యాదవ్. ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ సోమవారం ఉదయం జిల్లా ఎస్పీకి వినతిపత్రం అందించనున్నారు పవన్. తద్వారా డీజీపీ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లాలని నిర్ణయించాం. దీనికి సంబంధించి శనివారం మధ్యాహ్నం ఉమ్మడి చిత్తూరు జిల్లా నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించాం’
‘ సోమవారం ఉదయం 9.30 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు పవన్. 10.30గంటలకు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందజేస్తారు. ఈ కార్యక్రమాన్ని శాంతియుత, క్రమశిక్షణతో కూడిన వాతావరణంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలనుకుంటున్నాం’ అని నాదెండ్ల మనోహర్ ఈ ప్రకటనలో తెలిపారు.
సోమవారం తిరుపతికి శ్రీ @PawanKalyan గారు
• శ్రీ కొట్టే సాయిపై శ్రీకాళహస్తి సీఐ దాడి ఘటనపై జిల్లా ఎస్పీకి వినతిపత్రం pic.twitter.com/P2otok0MbR
— JanaSena Party (@JanaSenaParty) July 15, 2023
సీఐ అంజూ యాదవ్ దురుసు ప్రవర్తనకు సంబంధించిన వీడియో..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..