Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD Karthika Deepotsavam: తిరుపతిలో వైభవంగా కార్తీక దీపోత్సవం.. గోవింద నామస్మరణతో మారుమ్రోగిన టీటీడీ ప్రాంగణం

తిరుపతిలో కార్తీక దీపోత్సవం వేడుకగా జరిగింది. గోవిందనామస్మరణతో టీటీడీ పరిపాలన భవనం మైదానం మార్మోగింది. భారీ సంఖ్యలో హాజరైన భక్తులతో టీటీడీ కార్తీక దీపోత్సవం వేడుకగా నిర్వహించింది. కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతీతీర్థ స్వామి తోపాటు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి పాల్గొన్నారు. తిరుపతి టీటీడీ పరిపాలన భవనం మైదానంలో వేడుకగా కార్తీక దీపోత్సవం జరగ్గా గోవిందనామస్మరణతో మారుమోగింది. భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. వైష్ణవం, శైవం, శాక్తేయం తదితర సర్వ సంప్రదాయాలకు..

TTD Karthika Deepotsavam: తిరుపతిలో వైభవంగా కార్తీక దీపోత్సవం.. గోవింద నామస్మరణతో మారుమ్రోగిన టీటీడీ ప్రాంగణం
TTD Karthika Deepotsavam
Follow us
Raju M P R

| Edited By: Srilakshmi C

Updated on: Nov 21, 2023 | 7:37 AM

తిరుపతి, నవంబర్‌ 21: తిరుపతిలో కార్తీక దీపోత్సవం వేడుకగా జరిగింది. గోవిందనామస్మరణతో టీటీడీ పరిపాలన భవనం మైదానం మార్మోగింది. భారీ సంఖ్యలో హాజరైన భక్తులతో టీటీడీ కార్తీక దీపోత్సవం వేడుకగా నిర్వహించింది. కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతీతీర్థ స్వామి తోపాటు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి పాల్గొన్నారు. తిరుపతి టీటీడీ పరిపాలన భవనం మైదానంలో వేడుకగా కార్తీక దీపోత్సవం జరగ్గా గోవిందనామస్మరణతో మారుమోగింది. భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. వైష్ణవం, శైవం, శాక్తేయం తదితర సర్వ సంప్రదాయాలకు కార్తీకమాసం శ్రేష్టమైనదని, ఈ మాసంలో దైవ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వందల రెట్లు అధికంగా ఫలితం కలుగుతుందని కార్తీక దీపోత్సవంలో పాల్గొన్న కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతీతీర్థ స్వామి అభిప్రాయపడ్డారు.

అత్యంత వైభవంగా కార్తీక మహాదీపోత్సవం నిర్వహించగా టీటీడీ భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు సామూహిక దీపారాధన చేశారు. సిద్ధేశ్వరానంద భారతీతీర్థ స్వామి అనుగ్రహ భాషణం చేసారు. దీపాన్ని వెలిగిస్తే మనలోని అజ్ఞానం అనే అంధకారం తొలగి జ్ఞానం అనే వెలుగు ప్రకాశిస్తుందన్నారు. పవిత్రమైన కార్తీక మాసంలో టీటీడీ ఆధ్వర్యంలో దీపోత్సవం నిర్వహించడం ఎంతో సంతోషకరమన్నారు. ఈ మాసంలో నాగులచవితి, భైరవాష్టమి పర్వదినాలు రావడం శుభసూచికమని చెప్పారు. పూజ కంటే స్తోత్రం, స్తోత్రం కంటే జపం, జపం కంటే ధ్యానం, ధ్యానం కంటే ఏకాగ్రతతో కూడిన సమాధి స్థితి కోటి రెట్లు ఉత్తమమైనవన్నారు. ప్రతి ఒక్కరూ ధ్యానం ద్వారా ఈ స్థితిని సాధించాలని కోరారు. దైవనామాన్ని జపిస్తే దీర్ఘాయువు కలుగుతుందన్నారు. దీపోత్సవంలో పాల్గొన్న భక్తులందరికీ శ్రీనివాసుని కటాక్షం కలగాలని స్వామీజీ ఆకాంక్షించారు. ఇక దీపోత్సవం జ్ఞాన జ్యోతులు వెలిగించాలన్నారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి.

శ్రీవారి ఆశీస్సులతో ఈ దీపోత్సవం మనందరిలో అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన జ్యోతులు వెలిగించాలని ఆకాంక్షించారు. ప్రపంచ హైందవ సంస్కృతిని కాపాడేందుకు, ప్రజల్లో భక్తి భావాన్ని పెంచేందుకు టీటీడీ మహత్తరమైన భక్తిచైతన్య ఉద్యమాన్ని చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా 2021వ సంవత్సరం నుంచి కార్తీక మాసం సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కార్తీక మహా దీపోత్సవాలు నిర్వహిస్తున్నామన్నా మన్నారు. ఈ ఏడాది మొదటగా ఈ రోజు ఆ దేవ దేవుడి పాదాల చెంతన పెద్ద ఎత్తున కార్తీక మహా దీపోత్సవం నిర్వహించుకుంటున్నామన్నారు. శివ కేశవుల వైశిష్ట్యం, దీపం ప్రాముఖ్యత, దీపారాధన వల్ల లోకానికి కలిగే ప్రయోజనం గురించి ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు వివరించగలుగుతున్నామన్నా మన్నారు. అజ్ఞానమనే చీకట్లను పారదోలి ప్రజల హృదయాల్లో ఆధ్యాత్మిక జ్ఞానదీపాలు వెలిగించాలని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఈ సందర్భంగా ప్రార్థిస్తున్నామన్నారు. ప్రజల్లో భక్తి చైతన్యం మరింతగా నింపడానికి రామకోటి తరహాలోనే గోవింద కోటి రాసిన 18 నుండి 25 ఏళ్ళ లోపు వయసు ఉన్న యువతీయువకులకు వారితో పాటు కుటుంబ సభ్యులకు ఒక సారి స్వామివారి బ్రేక్ దర్శనం కూడా కల్పించాలని పాలక మండలి నిర్ణయం తీసుకుందని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.