PSLV-C54 Launch: నేడు నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ సీ54.. ప్రయోగం విజయవంతమవ్వాలని ఇస్రో చైర్మన్ ప్రత్యేక పూజలు
పీఎస్‌ఎల్‌వీ రాకెట్ సిరీస్‌లో 56వ ప్రయోగం. పీఎస్‌ఎల్‌వీ ఎక్స్‌ల్ వెర్షన్‌లో 24వది కావడం విశేషం. ఇక్కడికి వచ్చిన ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్.. పీఎస్‌ఎల్‌వీ సీ54 రాకెట్‌ను మరోమారు తనిఖీలు నిర్వహించారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమయింది. తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ54 ఉపగ్రహ వాహక నౌక ప్రయోగానికి రెడీ అయింది. కాసేపట్లో ప్రయోగం చేసేందుకు కౌంట్‌డౌన్ కొనసాగుతోంది. ఈ ఉదయం 11.56 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ54 రాకెట్‌ను ప్రయోగించేందుకు సర్వం సిద్ధమైంది. ప్రయోగానికి సంబంధించి షార్‌లోఎంఆర్‌ఆర్ కమిటీ చైర్మన్ బీఎన్ సురేష్ ఆధ్వర్యంలో మిషన్ రెడీనెస్ రివ్యూ జరిగింది. కాగా ఈ ప్రయోగం ద్వారా 9 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపనున్నారు. ఇందులో 960 కేజీల ఓషన్‌శాట్-3తో పాటు మరో ఎనిమిది నానో ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెడతారు. ఇస్రోకు చెందిన ఈఓఎస్–06 ఉపగ్రహంతో పాటు 8 ఉప గ్రహాలను వాణిజ్యపరంగా ప్రయోగిస్తోంది. షార్ నుంచి ఇది 87వ ప్రయోగం. పీఎస్‌ఎల్‌వీ రాకెట్ సిరీస్‌లో 56వ ప్రయోగం. పీఎస్‌ఎల్‌వీ ఎక్స్‌ల్ వెర్షన్‌లో 24వది కావడం విశేషం. ఇక్కడికి వచ్చిన ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్.. పీఎస్‌ఎల్‌వీ సీ54 రాకెట్‌ను మరోమారు తనిఖీలు నిర్వహించారు. కాగా ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ శుక్రవారం షార్ సమీపంలో చెంగాళమ్మ ఆలయంతోపాటు తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రయోగం విజయవంతం కావాలని పూజలు చేశారు.
భారత్, భూటాన్ సంయుక్తంగా రూపొందించిన భూటాన్ శాట్ ఉపగ్రహాన్ని తయారుచేశారు. పిక్సెల్ సంస్థ తయారు చేసిన ఆనంద్ శాట్, ధ్రువ స్పేస్ సంస్థ రూపొందించిన రెండు తైబోల్డ్ శాట్‌లు, అలాగే అమెరికాకు చెందిన స్పేస్ ఫ్లైట్ సంస్థకు చెందిన నాలుగు అస్ట్రోకాస్ట్ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపుతారు. 30 క్యూబిక్ సెంటీమీటర్ల భూటాన్ షాట్ ఉపగ్రహం.. భూటాన్ మీదుగా ఎగురుతూ భూమి ఉపరితలం చిత్రాలను తీస్తుంది. దీని బరువు 15 కిలోలు ఉంటుంది. ఇది భూటాన్ ఉపరితలాన్ని రోజుకు కనీసం రెండు మూడు సార్లు కవర్ చేస్తుంది. భూటాన్ 2019లో తన మొదటి ఉపగ్రహం భూటాన్-1ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. ఇది విద్య ఆధారిత క్యూబ్‌శాట్. ఓషన్‌శాట్ శ్రేణి ఉపగ్రహాలు భూమి పరిశీలన, నీటి వనరుల పర్యవేక్షణ, తుఫానుల అంచనా కోసం వినియోగిస్తున్నారు. మొదటి Oceansat 1999లో భూమి పైన దాదాపు 720 కి.మీ. దూరంలో ఉన్న పోలార్ సన్ సింక్రోనస్ ఆర్బిట్‌లో ప్రయోగించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..