AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Piyush Goyal: కరోనా విపత్కర సమయంలో భారత్‌ 150 దేశాలకు సాయం చేసింది : కేంద్ర రైల్వే శాఖ మంత్రి

Piyush Goyal: కరోనా కారణంగా భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు సైతం ఇబ్బందుల్లో పడిపోయాయి. కోవిడ్‌ కారణంగా ప్రధాన నరేంద్ర మోదీ సారథ్యంలో భారత ప్రభుత్వం తన శక్తిమే ప్రపంచదేశాలకు సాయం.

Piyush Goyal: కరోనా విపత్కర సమయంలో భారత్‌ 150 దేశాలకు సాయం చేసింది : కేంద్ర రైల్వే శాఖ మంత్రి
Subhash Goud
|

Updated on: Mar 13, 2021 | 6:03 PM

Share

Piyush Goyal: కరోనా కారణంగా భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు సైతం ఇబ్బందుల్లో పడిపోయాయి. కోవిడ్‌ కారణంగా ప్రధాన నరేంద్ర మోదీ సారథ్యంలో భారత ప్రభుత్వం తన శక్తిమే ప్రపంచదేశాలకు సాయం అందిస్తోందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్‌ గోపాల్‌ అన్నారు. శనివారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన తర్వాత కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. 130 కోట్ల మంది జనాభా గల భారతదేశం కరోనా కల్లోలం నుంచి అతి తక్కువ కాలంలోనే కోలుకుని ప్రపంచానికి తన సత్తా ఏమిటో చూపించిందని అన్నారు. కరోనా సమయం భారతదేశం ఏ ఒక్కరి మీద ఆధారపడలేదని, పైగా వైరస్‌పై పోరాటంలో భాగంగా మన దేశమే ప్రపంచ దేశాలకు సాయం చేసిందని మంత్రి పేర్కొన్నార. ‘వసుధైక కుటుంబం’ స్ఫూర్తితో ప్రధాని నరేంద్రమోదీ 150 దేశలకు కోవిడ్‌-19 మెడిసిన్‌ను అందించారని గోయల్‌ గుర్తు చేశారు. కరోనా మహమ్మారి ముప్పు ఇంకా పోలేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం లాంటివి పాటించాలని సూచించారు. అయితే ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్‌ అందే వరకు వేచి ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కరోనా కారణంగా ఆయా రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసులపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. కరోనా కట్టడికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ వచ్చింది కదా అని ఎవ్వరు కూడా నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. ఇప్పటికే కరోనాతో దేశమంత నష్టపోతోందని, ఇలాటి పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. కరోనాను కట్టడి చేయాలని ప్రతి ఒక్కరు నిబంధనలు పాటిస్తే సరిపోతుందని అన్నారు.

ఇవీ చదవండి :

BREAKING, TTD: నిలిచిపోయిన టీటీడీ సర్వర్లు.. ఇబ్బందులు ఎదుర్కుంటున్న భక్తులు

శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల‌కు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌.. వాహనసేవల వివరాలు ఇవే..

ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్
మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!