Andhra News: తిరుపతిలోని ఐసర్ ల్యాబ్‌లో భారీ అగ్నిప్రమాదం.. విద్యార్థులను సేఫ్‌గా బయటకు తెచ్చిన ఫైర్ సిబ్బంది!
తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఏర్పేడు మండలం జంగాల పల్లి వద్ద ఉన్న కేంద్ర విద్యాసంస్థ ఐసర్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది విద్యార్థులను బయటకు పంపి మంటలు అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

తిరుపతి సమీపంలోని ఏర్పేడు మండలం జంగాల పల్లి వద్ద ఉన్న కేంద్ర విద్యాసంస్థ ఐసర్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది తిరుపతికి చెందిన భారతీయ విజ్ఞాన శిక్షణ పరిశోధన సంస్థ లోని ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. జీ ప్లస్ 5 బిల్డింగ్ లోని పై అంతస్తులో ఉన్న ల్యాబ్‌లో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దాదాపు 3 వేల 3500 రకాల రసాయనాలతో పరిశోధనలు జరుగుతున్న ల్యాబ్‌లో చోటు చేసుకున్న ప్రమాదం అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. ల్యాబ్‌లో ఉన్న రసాయనాలు మొత్తం మండే స్వభావం ఉన్నవి కావడంలతో ఘటనా ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగడంతో పాటు దట్టమైన పొగ కమ్ముకుంది.
ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే అప్రమత్తమైన ఐసర్ ఉన్నతాధికారులు రీసెర్చ్ భవనంలోని కెమిస్ట్రీ ల్యాబ్ లో ఉన్న విద్యార్థులను సురక్షితంగా బటయకు తీసుకొచ్చారు. అయితే దట్టంగా పొగ అలుముకున్న ల్యాబ్‌లో ఉన్న విద్యార్థులను బయటకు తీసుకురావడానికి సిబ్బంది ఎంతో శ్రమించారు. ఎట్టకేలకు విద్యార్థులను బయటకు తీసుకువచ్చిన అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
వీడియో చూడండి..
వెంటనే సమాచారం అందుకున్న శ్రీకాళహస్తి, వెంకటగిరి, తిరుపతి నుంచి మూడు ఫైర్ ఇంజన్లు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. దాదాపు 3 గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించక పోవడంతో కళాశాల యాజమాన్యం, అధికారులు, విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. రూ .కోట్ల విలువైన ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.