AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక : తిరుమల తిరుపతి దేవస్థానం

తిరుమలకు వెళ్లే అలిపిరి నడకమార్గం మరో రెండు నెలలు పాటు మూసివేయబోతున్నారు. సెప్టెంబరు మాసం లోపుగా మెట్ల మార్గంలో అభివృద్ధి పనులు..

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక : తిరుమల తిరుపతి దేవస్థానం
అటు గత నెలలో తిరుమల శ్రీవారిని మొత్తం 5.32 లక్షల మంది భ‌క్తులు దర్శించుకున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు స్వామివారిని దర్శించుకుని పులకించారు.
Venkata Narayana
|

Updated on: Jul 14, 2021 | 7:07 AM

Share

Alipiri : తిరుమలకు వెళ్లే అలిపిరి నడకమార్గం మరో రెండు నెలలు పాటు మూసివేయబోతున్నారు. సెప్టెంబరు మాసం లోపుగా మెట్ల మార్గంలో అభివృద్ధి పనులు పూర్తి చెయ్యాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఇఓ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫలితంగా, కాలినడకన శ్రీవారి దర్శనం చేసుకోవాలని భావించే భక్తులు సెప్టెంబరు వరకు శ్రీవారిమెట్టు నడక మార్గం ద్వారానే చేరుకునేందుకు భక్తులను అనుమతినిచ్చింది టీటీడీ. కాగా, మే నెలలో అలిపిరి నడక మార్గంలో మరమ్మత్తు పనులకు తిరుమల తిరుపతి దేవస్థానం నడుంబిగించింది. దీంతో అప్పటి నుంచి అలిపిరి మెట్లదారిని రెండు నెలలపాటు మూసివేసి పనులు చేపట్టారు.

అయితే, నిర్దేశిత సమయంలో పనులు పూర్తి కాకపోవడంతో మరో రెండు నెలలపాటు మెట్ల మార్గాన్ని మూసివేయాలని తాజాగా నిర్ణయించారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. అలిపిరి మెట్ల మార్గంలో భక్తుల రాకపోకల్ని అనుమతించడం లేదని తెలిపింది. ప్రత్యామ్నాయంగా భక్తులు శ్రీవారి మెట్టు నడకమార్గాన్ని వినియోగించు కోవాలని టీటీడీ సూచించింది. కరోనా లాక్ డౌన్ల నేపథ్యంలో తిరుమలకు భక్తుల రాక తగ్గిన నేపథ్యంలో ఆ సమయంలో మరమ్మత్తుల కార్యక్రమం చేపట్టాలని టీటీడీ నిర్ణయించి, ఆదిశగా పనులు షురూ చేసిన సంగతి తెలిసిందే.

కాగా, 2020 సెప్టెంబర్ లో కూడా అలిపిరి మెట్ల మార్గంలో మరమ్మత్తు పనులు చేశారు. ఈ పనులకోసం అప్పట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ 20 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చింది. మామూలు రోజుల్లో దాదాపు 20వేల మంది భక్తులు ఈ మెట్ల మార్గం గుండా స్వామివారిని దర్శించుకునేందుకు కాలినడకన తిరుమల కొండపైకి చేరుకుంటారు.ఈ ఏడాది జూన్ 1 నుంచి జూలై 31వరకు అలిపిరి నడకమార్గంలో పైకప్పు నిర్మాణ పనులు జరిగాయి. కాగా, కరోనా అన్ లాక్ దక్షిణ భారత దేశంలో దాదాపు పూర్తిగా అమల్లోకి రావడంతో తిరుమలలో భక్తుల రద్ధీ సాధారణ స్థాయికి చేరుకుంటోంది.

Read also:  ‘చంద్రబాబు ఒక పిశాచంలా దాపురించాడు.. రెండు రాష్ట్రాల మధ్య అగ్గి రాజుకోవాలని గోతికాడ నక్కలా కాచుక్కూచున్నాడు’