‘చంద్రబాబు ఒక పిశాచంలా దాపురించాడు.. రెండు రాష్ట్రాల మధ్య అగ్గి రాజుకోవాలని గోతికాడ నక్కలా కాచుక్కూచున్నాడు’

జల జగడంతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అగ్గి రాజుకోవాలని బాబు గోతికాడ నక్కలా కాచుక్కూచున్నాడు అంటూ టీడీపీ అధినేతపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర..

'చంద్రబాబు ఒక పిశాచంలా దాపురించాడు.. రెండు రాష్ట్రాల మధ్య అగ్గి రాజుకోవాలని గోతికాడ నక్కలా కాచుక్కూచున్నాడు'
MP Vijayasaireddy

Vijayasai reddy – Chandrababu: జల జగడంతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అగ్గి రాజుకోవాలని బాబు గోతికాడ నక్కలా కాచుక్కూచున్నాడు అంటూ టీడీపీ అధినేతపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు ఒక పిశాచంలా దాపురించాడ‌ని విజ‌య‌సాయిరెడ్డి మండిప‌డ్డారు. ఎల్లో మీడియా, ఆ పార్టీ చోటా.. మోటా లీడర్లు బాధ్యత లేకుండా వక్ర భాష్యాలు చెబుతున్నారంటూ విజయసాయి దుయ్యబట్టారు.

ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందన్న ఆయన ఏపీ, తెలంగాణ జలవివాదంలో కేంద్రం న్యాయం చేస్తుందనే భావిస్తున్నామని తెలిపారు. “అప్పట్లో పోతిరెడ్డిపాడు విస్తరణ నిలిపేయాలని ప్రకాశం బ్యారేజిపై ధర్నాలు చేయించాడు చంద్రబాబు.. కృష్ణా డెల్టా ఎడారి అవుతుందని దుష్ప్రచారం చేశాడు. రెండేళ్లుగా అన్ని ఎన్నికల్లో జనం చెప్పుతో కొట్టాక రాష్ట్రం సుభిక్షంగా ఉండకూడదని కసి పెంచుకున్నాడు. ఒక పిశాచంలా దాపురించాడు చంద్రబాబు” అంటూ విజయసాయి ట్వీట్ చేశారు.

Read also: Tv9: టీవీ9 కథనాల ఫలితం.. అలిపిరిలో కిడ్నాప్‌కు గురైన బాలుడు క్షేమంగా ఇంటికొచ్చిన వైనం.!

Click on your DTH Provider to Add TV9 Telugu