Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: చోరీ అయిన 1,180 ఫోన్లు రికవరీ.. ఏ మొబైల్ పోయినా ఈ నంబర్‌కి కాల్ చేయమంటున్న పోలీసులు..

Tirupati: మొబైల్స్‌ పోగొట్టుకున్నవారికి తిరుపతి జిల్లా పోలీసులు శుభవార్త చెప్పారు. ఏకంగా.. రూ. 2.1 కోట్ల విలువైన 1,180 మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్న పోలీసులు వెంటనే వాటిని సంబంధిత ఓనర్స్‌కి హ్యాండ్‌ ఓవర్ చేశారు. అయితే మొత్తం ఐదు దశల్లో రికవరీ ఆపరేషన్..

Andhra Pradesh: చోరీ అయిన 1,180 ఫోన్లు రికవరీ.. ఏ మొబైల్ పోయినా ఈ నంబర్‌కి కాల్ చేయమంటున్న పోలీసులు..
Tirupati Police
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 10, 2023 | 5:16 PM

Tirupati: మొబైల్స్‌ పోగొట్టుకున్నవారికి తిరుపతి జిల్లా పోలీసులు శుభవార్త చెప్పారు. ఏకంగా.. రూ. 2.1 కోట్ల విలువైన 1,180 మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్న పోలీసులు వెంటనే వాటిని సంబంధిత ఓనర్స్‌కి హ్యాండ్‌ ఓవర్ చేశారు. అయితే మొత్తం ఐదు దశల్లో రికవరీ ఆపరేషన్ చేపట్టిన పోలీసులు.. తొలి నాలుగు దశల్లో రూ.1.4 కోట్ల విలువ చేసే 780 ఫోన్లు రికవరీ అయ్యాయి. ఆ తర్వాత చివరి ఒక్క దశలోనే రూ.72 లక్షల విలువైన మరో 400 ఫోన్లు అదనంగా రికవరీ అయ్యాయి. రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, సీఐ రాంచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పనిచేసిన ప్రత్యేక బృందం పోయిన మొబైల్‌లను వెలికితీశారు.

ఫోన్ల రికవరీ ఆపరేషన్ గురించి తిరుపతి ఎస్పీ పీ. పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ‘‘మొబైల్ ఫోన్‌ పోగొట్టుకున్నవారు వెంటనే మొబైల్ హంట్ వాట్సాప్ నంబర్(9490617873)కి ‘హాయ్’ లేదా ‘హెల్ప్’ అని మెసేజ్ చేసి అవసరమైన వివరాలు చెప్తే  చాలు. లేదా CEIR (సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్‌లో కేసు రిజిస్టర్ చేయవచ్చు. అలా చేయడం ద్వారా  మీ ఫోన్ దుర్వినియోగం కాకముందే బ్లాక్ అవుతుంది. ఇంకా రికవరీ ప్రక్రియను వేగవంతం చేయడంలో పోలీసులకు సహాయంగా ఉంటుంది’ అని పేర్కొన్నారు.

మరోవైపు ఫోన్‌ పోగొట్టుకున్నా లేదా ఎవరైనా మొబైల్‌ను దొంగిలించినా వెంటనే CEIR పోర్టల్‌లో ఫిర్యాదు చేయమని పదేపదే చెబుతున్నారు అధికారులు. అయితే ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదుల్లో 50% మాత్రమే పరిష్కరించినట్లుగా వారు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..