Tirupati: గంగమ్మ జాతరలో అద్భుత ఘట్టం..టీటీడీ నుండి అమ్మవారికి అందిన సారె..వెంకన్న వేషధారణలో తిరుపతి ఎంపీ

|

May 15, 2022 | 8:07 PM

తిరుపతి గంగమ్మ జాతర కు తొమ్మిది శతాబ్దాల చరిత్ర ఉంది. ఎనిమిది రోజులపాటు అత్యంత వైభవంగా ఈ జాతరలో భక్తులు రోజుకో వేషంలో అమ్మవారిని దర్శించుకుంటారు. బైరాగి వేషంతో ప్రారంభమయ్యే..

Tirupati: గంగమ్మ జాతరలో అద్భుత ఘట్టం..టీటీడీ నుండి అమ్మవారికి అందిన సారె..వెంకన్న వేషధారణలో తిరుపతి ఎంపీ
Tirupati Mp Gurumurthy
Follow us on

తిరుపతి గంగమ్మ జాతర కు తొమ్మిది శతాబ్దాల చరిత్ర ఉంది. ఏటా వారం రోజులపాటు కొనసాగే ఈ ఉత్సవాలలో భాగంగా రకరకాల వేషధారణలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకునే ఆనవాయితీ కొనసాగుతోంది. ఎనిమిది రోజులపాటు అత్యంత వైభవంగా ఈ జాతరలో భక్తులు రోజుకో వేషంలో అమ్మవారిని దర్శించుకుంటారు. బైరాగి వేషంతో ప్రారంభమయ్యే వేషాల కోలాహలం గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఉంటాయి. రాయలసీమ పరిసర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలు, వారి జీవన విధానాలకు అద్దంపడతాయి. ప్రతి వేషంలోనూ ఎంతో ప్రత్యేకత, ఆధ్యాత్మిక అంతర్యం దాగివుంది. పాలేగాడిని గుర్తించడానికి అమ్మవారు ఆయా రోజుల్లో వేసే వేషాలను భక్తులు అనుసరించడం దీంతో అమ్మవారు సంతృప్తి చెంది వారి కోరికలు తీర్చుతుందన్నది ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. కరోనా కారణంగా రెండేళ్ళ విరామం తర్వాత ప్రస్తుతం ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా టీటీడీ సిబ్బంది, అధికారులతో సహా పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, పీఠాధిపతులు అమ్మవారికి సారెలు సమర్పిస్తున్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా తిరుపతి లోక్ సభ సభ్యుడు డాక్టర్ మద్దెల గురుమూర్తి గంగమ్మ తల్లి సోదరుడుగా భక్తులు భావించే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వేషధారణతో అమ్మవారి మొక్కులు తీర్చుకున్నారు.

ఈ ఏడాది జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సప్పరాలు, కోలాటాలు, పిల్లనగ్రోవెలు, డప్పులు, సన్నాయి వాయిద్యాల మధ్య భక్తులు బైరాగివేషంలో ఆలయానికి చేరుకుంటున్నారు. ఆనవాయితీ ప్రకారం జాతర ప్రారంభం రోజున వర్షం కురుస్తుంది. ఆనవాయితీని అనుసరిస్తూ.. జాతర ప్రారంభమైన రోజున కూడా ఆరంభానికి శుభసూచకంగా వర్షపు జల్లులు పడ్డాయి. ప్రజలందరికీ చాలా మంచి జరుగుతుందనడానికి ఇదో సంకేతమని స్థానికుల నమ్మకం.

IPL Betting: ఐపీఎల్‌ బెట్టింగ్‌..హైదరాబాద్‌ టూ పాకిస్థాన్‌..మధ్యలో ప్రభుత్వాధికారులు, పలువురు పెద్దలు

Jim Green: అతి త్వరలోనే మనుషులు ఏలియన్స్‌ని కలుసుకుంటారు..నాసా మాజీ శాస్త్రవేత్త షాకింగ్‌ కామెంట్స్‌!

Cyber Fraud: సోషల్‌ మీడియా వినియోగదారులకు హెచ్చరిక..! మర్చిపోయి కూడా అలా చేయ్యొద్దు..!!

Telangana: నీ ఉద్యోగం ఉండాలంటే నేను మీ ఇంటికి రావాలి…! మహిళ ఉద్యోగికి ఎదురైన షాకింగ్‌ సీన్‌

Trees Plantation : చనిపోయిన అమ్మకోసం ఓ లాయర్‌ కొడుకు గిఫ్ట్‌..పాతికేళ్లనాటి మామిడి చెట్టును కూకటి వేళ్లతో పెకిలించాడు..!

US coast: సముద్ర తీరంలో భారీ తిమింగలం కళేబరం…స్థానికుల్ని స్థలం ఖాళీ చేయించిన పోలీసులు..దాని పొట్ట నిండా అవే..!

Mistery village: సైన్స్‌కు సాధ్యం కాని అంతు చిక్కని రహస్యం.. 12 ఏళ్లుగా అబ్బాయిలే పుట్టని ఊరు..! ఎక్కడంటే..

Ananthapur: చిరుతను ఉరికించి ఉరికించి తరిమేసిన కుక్కలు, ఇంటర్‌ వీడియో కాదు..ఇది లైవ్‌ సీన్‌