Andhra Pradesh: సోమశిల అటవీప్రాంతంలో పెద్దపులి షికార్లు? వదంతులు నమ్మోద్దంటోన్న అధికారులు..

కర్నూలులో పులిపిల్లల నుంచి తప్పిపోయిన పెద్దపులి కృష్ణనది దాటి సోమశిల అటవీప్రాంతంలోకి వచ్చిందని వదంతులు షికార్లు చేస్తున్నాయి. దీంతో అటవీశాఖ అధికారులు సోమశిల అటవీప్రాంతంలో కెమెరాలు ఏర్పాటు చేశారు.

Andhra Pradesh: సోమశిల అటవీప్రాంతంలో పెద్దపులి షికార్లు? వదంతులు నమ్మోద్దంటోన్న అధికారులు..
Tiger Tension
Follow us
Venkata Chari

|

Updated on: Mar 25, 2023 | 5:47 AM

కర్నూలులో పులిపిల్లల నుంచి తప్పిపోయిన పెద్దపులి కృష్ణనది దాటి సోమశిల అటవీప్రాంతంలోకి వచ్చిందని వదంతులు షికార్లు చేస్తున్నాయి. దీంతో అటవీశాఖ అధికారులు సోమశిల అటవీప్రాంతంలో కెమెరాలు ఏర్పాటు చేశారు. పులికి సంబంధించి ఎక్కడా ఆనవాల్లు కనిపించలేదని తేల్చిన అధికారులు వదంతులు నమ్మోద్దని ప్రకటించారు. ఈ నెల మొదటి వారంలో పులి పిల్లల ప్రత్యక్షం పెద్ద సంచనలంగా మారింది. తల్లితో ఏడబాటు అయిన పిల్లలు బిక్కుబిక్కుమంటూ వారం పాటు కాలం గడిపాయి.

తల్లి దగ్గరకు చేర్చేందుకు అటవీ శాఖ అధికారులు చేసిన ప్రయత్నాలు ఎంతకీ ఫలించలేదు. తల్లిని కనుగొనేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. చివరికి ఆ నాలుగు పిల్లలను జూపార్‌కు తరలించారు అధికారులు. తల్లిని కనుగొనేందుకు అధికారులు విశ్వప్రయత్నం చేసినా.. వృథానే అయ్యింది. సీసీ కెమెరాల నిఘా వృధాప్రయాసే అయ్యింది.

ఎట్టకేలకు ఆపరేషన్‌ లీలావతికి ముగింపు పలక్క తప్పలేదు ఫారెస్ట్‌ అధికారులకు. ఈ క్రమంలో పులి పిల్లలు అనారోగ్యం బారిన పడకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. రెండు నుంచి మూడు నెలల వయస్సున్న పులి పిల్లలను సేఫ్‌గా జూకు తరలించారు.

ఇవి కూడా చదవండి

అయితే తల్లి పులి ఎక్కడుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. తాజా సమాచారం ప్రకారం అది సోమశిల అటవీ ప్రాంతంలోకి వచ్చిందనేది ప్రచారం. దీనిపై నిఘా పెట్టిన అధికారులు.. అదంతా ఉట్టి ప్రచారం మాత్రమే అని తేల్చారు. అక్కడ తల్లి పులి లేదని కన్‌ఫామ్ చేశారు. వదంతలు నమ్మొద్దని స్పష్టం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..