AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhrapradesh: ఏపీలోని ప‌లు జిల్లాల‌కు పిడుగు హెచ్చ‌రిక‌.. కీల‌క సూచ‌న‌లు చేసిన విప‌త్తుల శాఖ‌

ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, చిత్తూరు, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా పిడుగులు ఉధృతంగా పడే అవకాశం ఉందని ఆంధ్ర‌ప్రదేశ్ విపత్తుల శాఖ ఒక ప్ర‌క‌ట‌న విడుదల చేసింది..

Andhrapradesh: ఏపీలోని ప‌లు జిల్లాల‌కు పిడుగు హెచ్చ‌రిక‌.. కీల‌క సూచ‌న‌లు చేసిన విప‌త్తుల శాఖ‌
thunderstorm in telangana
Ram Naramaneni
|

Updated on: Apr 23, 2021 | 5:32 PM

Share

ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, చిత్తూరు, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా పిడుగులు ఉధృతంగా పడే అవకాశం ఉందని ఆంధ్ర‌ప్రదేశ్ విపత్తుల శాఖ ఒక ప్ర‌క‌ట‌న విడుదల చేసింది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడ‌ద‌ని సూచించింది. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాల‌ని పేర్కొంది.

వివిధ జిల్లాల్లో పిడుగులు ప‌డే అవ‌కాశం ఉన్న ప్రాంతాలు..

ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం, బేస్తవారిపేట, వెలిగండ్ల, కనిగిరి, హనుమంతునిపాడు, కొనకనమిట్ల, మర్రిపూడి, పొదిలి, గిద్దలూరు, చీమకుర్తి.

నెల్లూరు జిల్లా నెల్లరు, సీతారామపురం, వరికుంటపాడు, ఉదయగిరి, దుత్తలూరు, మర్రిపాడు, అనంతసాగరం, ఆత్మకూరు, చేజర్ల, పొదలకూర్, దగదర్తి, అనుమసముద్రంపేట, కలిగిరి, సంగం, కొడవలూరు.

కర్నూలు జిల్లా కర్నూలు, నందికోట్కూరు, కల్లూరు, పగిడ్యాల, జూపాడుబంగ్లా, మిడ్తూరు, ఓర్వకల్లు, గడివేముల, దేవనకొండ, సి.బేళగల్, కొత్తపల్లె, వెల్దుర్తి.

చిత్తూరు జిల్లా శాంతిపురం, రామకుప్పం, వెంకటగిరికోట, బైరెడ్డిపల్లె, పలమనేరు, బంగారుపాలెం, గంగవరం, సోమల.

విజయనగరం జిల్లా మెరకముడిదం, గరివిడి, చీపురుపల్లి, గుర్ల, తేర్లాం, బాడంగి, దత్తిరాజేరు, నెల్లిమర్ల, బొందపల్లి, బొబ్బిలి.

శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం, గంగువారి సిగడాం , రాజాం, సంతకవిటి, రేగడిఆముదాలవలస, ఎచ్చెర్ల, రంగస్థలం, బూర్జ.

తూర్పుగోదావరి జిల్లా చింతూరు, వరరామచంద్రాపురం, మారేడుమిల్లి, వై.రామవరం.