Andhra Pradesh: మరణంలోనూ వీడని స్నేహం.. బైక్ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి..
దేశపాత్రునిపాలెం రోడ్డులో సెక్టార్-12 మలుపు వద్ద బైక్ అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. త్రిబుల్ రైడింగ్ లో వాసు, సోమేష్ ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. తీవ్రంగా గాయపడిన మరో యువకుడు రాజుని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు రాజు. మృతులు గంగవరంకు చెందినవారు.

ముగ్గురు స్నేహితులు.. పేద కుటుంబాలు కావడంతో చిన్న వయసు నుంచే కుటుంబానికి ఆసరాగా భరోసాగా ఉన్నారు. ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు పనులు చేసుకుంటూ ఉన్నారు. ముగ్గురు స్నేహితుల్లో ఇద్దరికీ తండ్రులు కూడా లేకపోవడంతో వాళ్లపైనే కుటుంబ భారం పడింది. పనికి వెళ్లినా.. ఆటలాడేందుకు వెళ్లినా ముగ్గురు కలిసి వెళ్లాల్సిందే.. ఎక్కడికి వెళ్లినా ఏ పని చేసినా ముగ్గురు ఒక్కరిగా ఉంటారు. అయితే విధి కూడా ఈ స్నేహితుల పట్ల చిన్నచూపు చూసింది. రోడ్డు ప్రమాదం ముగ్గురుని ఒకేసారి మృత్యువు తన ఒడిలోకి తీసుకుంది.
విశాఖ గాజువాక స్టీల్ ప్లాంట్స్ సెక్టర్ 12 లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు స్నేహితుల ప్రాణాలు తీసింది. దేశపాత్రునిపాలెం రోడ్డులో సెక్టార్-12 మలుపు వద్ద బైక్ అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. త్రిబుల్ రైడింగ్ లో వాసు, సోమేష్ ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. తీవ్రంగా గాయపడిన మరో యువకుడు రాజుని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు రాజు. మృతులు గంగవరంకు చెందినవారు. ఎలక్ట్రికల్ పనులు చేసుకుంటూ కుటుంబానికి చేదోడువాదుడుగా ఉంటున్నారు. ముగురు స్నేహితులే. గంగవరం నుంచి పూడిమడక శుభకార్యానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
ఘటనాస్థలానికి సీపీ
ఘటనా స్థలిని సీపీ రవిశంకర్ అయ్యనార్ పరిశీలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. మలుపులో బైక్ కంట్రోల్ కాకపోవడంతో డివైడర్ ను ఢీకొట్టి ప్రమాదం జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు.
కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబాలు..
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సోమేశ్ తండ్రి చిన్నతనంలోనే మృతి చెందాడు. ఇద్దరు కొడుకులతో తల్లి ఎల్లమ్మ జీవనం సాగిస్తోంది. ఎల్లమ్మ కూడా కూలి పని చేసుకుంటుంది. ఇద్దరు కొడుకుల్లో చిన్నవాడు సోమేశ్ కావడంతో ఆ తల్లి తల్లడిల్లిపోతుంది. మరో యువకుడి వాసు తండ్రి కూడా గతంలోనే మరణించాడు. తల్లి మంగమ్మ ముగ్గురు అక్కలతో కలిసి వాసు నివసిస్తున్నాడు. తమ కుటుంబాలకు ఆధారమైన కొడుకు అకాల మృతితో ఆ కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




