AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం.. నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృతి!

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుప్పం మండలం దేవరాజపురంలో నీటిగుంతలో పడి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మృతులు స్థానికంగా నివసించే గౌతమి(7), షాలిని(6), అశ్విన్(7) తెలుస్తోంది. అయితే ఇంటి నిర్మాణం కోసం తీసిన పునాధి గుంతలోకి నీరు చేరగా.. అక్కడే ఆడుకుంటున్న పిల్లలు ఈ నీటిలో పడి చనిపోయినట్టు తెలుస్తోంది.

Andhra News: చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం.. నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృతి!
Anand T
|

Updated on: May 18, 2025 | 8:32 PM

Share

ఆడుకుంటూ నీటి గుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. కుప్పం మండలం దేవరాజపురానికి చెందిన ముగ్గురు చిన్నారులు గౌతమి(7), షాలిని(6), అశ్విన్(7) వారు నివసిస్తున్న ఇంటి సమీపంలో ఆడుకుంటూ ఉన్నారు. అయితే ఆ పక్కనే ఇంటి నిర్మాణం కోసం తీసిన ఓ ఫునాధి ఉంది. అయితే గత కొన్ని రోజులుగా ఆ ప్రాంతంలో వర్షాలు కురవడంతో ఆ పునాధి గుంతలోకి భారీగా నీరు చేరాయి. ఈ క్రమంలో దాని పక్కనే ఆడుకుంటున్న చిన్నారులు ప్రమాదవశాత్తు ఆ నీటి గుంతలో పడిపోయారు. ఉపిరిరాకడ నీటిలోనే మునిగి ప్రాణాలు విడిచారు.

ఇక గుంతలో చిన్నారులను గమనించిన స్థానికులను వారిని హాస్పిటల్‌కు తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారులు మృతి చెందినట్టు తెలిపారు. దీంతో ఆ ముగ్గురు చిన్నారుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తమ పిల్లలు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకే రోజు ముగ్గురు చిన్నారుల మృతితో దేవరాజపురంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

ఇదిలా ఉండగా విజయనగరంలో కూడా ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ద్వారపూడి గ్రామానికి చెందిన నలుగురు చిన్నారులు కారులో ఆడుకుంటూ ఉండగా లాక్ పడి ఊపిరాడక మృతి చెందారు. ఇలా రాష్ట్రంలో ఒకే రోజు వరుస విషాదాలు నెలకొనడం తీవ్ర కలకలం రేపుతోంది. ఓకే రోజు ఏడుగురు చిన్నారులు మృతి చెందండం రాష్ట్ర వ్యాప్తంగా విషాదాన్ని నింపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్