AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో తీవ్ర విషాదం.. ఏడుగురు చిన్నారుల మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం, చిత్తూరు జిల్లాల్లో జరిగిన వేరు వేరు ప్రమాదాల్లో ఏడుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే రోజు రెండు ప్రాంతాల్లో జరిగిన రెండు ప్రమాదాల్లో ఏకంగా ఏడుగురు పసిబిడ్డలు దూరమవ్వడం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. బాధిత కుటుంబాలకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రకటనలో పేర్కొన్నారు.

ఏపీలో తీవ్ర విషాదం.. ఏడుగురు చిన్నారుల మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..
Cm Chandrababu
Anand T
| Edited By: |

Updated on: May 18, 2025 | 9:57 PM

Share

ఏపీలో ఒకే రోజు ఏడుగురు చిన్నారులు మృతి చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం దేవరాజపురం గ్రామానికి చెందిన ముగ్గురు పిల్లలు అడుకుంటూ నీటి కుంటలో పడి ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సీఎం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఒకే కుటుంబానికి చెందిన పిల్లలు గౌతమి, శాలిని, అశ్విన్ నీటి కుంటలో పడి ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. బిడ్డల మృతితో తీవ్ర శోకంలో ఉన్న తల్లిదండ్రులకు సీఎం చంద్రబాబు సానుభూతి తెలిపారు.

మరోవైపు విజయనగరం జిల్లా ద్వారపూడి గ్రామంలో కారు డోర్లు లాక్ పడిన సంఘటనలో నలుగురు చిన్నారులు చనిపోవడంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆడుకునేందుకు వెళ్లిన పిల్లలు…ఆగి ఉన్న ఒక కారు ఎక్కగా డోర్ లాక్ పడి బయటకు రాలేక అందులోనే చనిపోయిన ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. కారులో చిక్కుకుని ఊపిరి అందక ఉదయ్, జాశ్రిత, చారులత, మణీశ్వరి ప్రాణాలు కోల్పోవడంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. రెండు ఘటనల్లో 10 ఏళ్లు కూడా నిండని బిడ్డలు చనిపోవడం తనను తీవ్ర వేదనకు గురిచేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటనలో తెలియజేశారు.

మరోవైపు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కూడా ఈ సంఘటనలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని రెండు వేరు వేరు ప్రమాదాల్లో ఏడుగురు చిన్నారులు చనిపోవడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆమె అన్నారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అవాంఛిత గర్భధారణకు చెక్.. ఈ మ్యాజిక్ స్టిక్ తో మూడేళ్లు సేఫ్!
అవాంఛిత గర్భధారణకు చెక్.. ఈ మ్యాజిక్ స్టిక్ తో మూడేళ్లు సేఫ్!
డాక్యుమెంట్స్ పోగొట్టిన ఎస్బీఐకు వినియోగదారుల ఫోరం భారీ జరిమానా
డాక్యుమెంట్స్ పోగొట్టిన ఎస్బీఐకు వినియోగదారుల ఫోరం భారీ జరిమానా
అండర్ 19 ప్రపంచకప్ విజేతలపై బీసీసీఐ కాసుల వర్షం..
అండర్ 19 ప్రపంచకప్ విజేతలపై బీసీసీఐ కాసుల వర్షం..
వాలెంటైన్స్ వీక్ రోజ్ డే తోనే ఎందుకు స్టార్ట్ అవుతుంది..?
వాలెంటైన్స్ వీక్ రోజ్ డే తోనే ఎందుకు స్టార్ట్ అవుతుంది..?
సోఫాలు, పడకలున్నా కుక్కలు తలుపు దగ్గరే ఎందుకు పడుకుంటాయి?
సోఫాలు, పడకలున్నా కుక్కలు తలుపు దగ్గరే ఎందుకు పడుకుంటాయి?
ఆ హీరో ఇంటిముందు వర్షంలో తడుస్తూ రోజంతా నిలబడ్డా..!
ఆ హీరో ఇంటిముందు వర్షంలో తడుస్తూ రోజంతా నిలబడ్డా..!
వెండి గుట్టు విప్పిన నిపుణులు.. గనుల నుంచి మార్కెట్ దాకా ప్రయాణం
వెండి గుట్టు విప్పిన నిపుణులు.. గనుల నుంచి మార్కెట్ దాకా ప్రయాణం
ఇంట్లో ఈ ఐదు వస్తువులు ఉంటే.. మీపై లక్ష్మీ కటాక్షం ఖాయం..!
ఇంట్లో ఈ ఐదు వస్తువులు ఉంటే.. మీపై లక్ష్మీ కటాక్షం ఖాయం..!
ఏం హుషారున్నార్రా సామి.. ఏకంగా కంపెనీకి వెళ్లి వాళ్లకే బురిడీ..
ఏం హుషారున్నార్రా సామి.. ఏకంగా కంపెనీకి వెళ్లి వాళ్లకే బురిడీ..
సబ్బు Vs ఫేస్ వాష్: మెరిసే చర్మానికి ఏది మంచిది..?
సబ్బు Vs ఫేస్ వాష్: మెరిసే చర్మానికి ఏది మంచిది..?