Amalapuram: ఈ పొగతో కరోనా పరార‌వుతుంద‌ట‌.. అమలాపురంలో వైర‌స్ కట్టడికి వినూత్న ప్రయత్నం

కరోనా మహమ్మారి దేశమంతా క‌ల్లోలం రేపుతోంది మాయదారి రోగం బారి నుంచి ఎప్పుడు బయటపడుతామా అని అందరూ ఎదురుచేస్తున్నారు. ఇలాంటి....

Amalapuram: ఈ పొగతో కరోనా పరార‌వుతుంద‌ట‌.. అమలాపురంలో వైర‌స్ కట్టడికి వినూత్న ప్రయత్నం
Herbal Smoke

కరోనా మహమ్మారి దేశమంతా క‌ల్లోలం రేపుతోంది మాయదారి రోగం బారి నుంచి ఎప్పుడు బయటపడుతామా అని అందరూ ఎదురుచేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఏ చిన్న మందు వచ్చిన జనంలో ఆశలు చిగురిస్తున్నాయి. వైరస్‌తో ఇబ్బందులు పడుతున్నా..మూఢ నమ్మకాలు మాత్రం తొలగడం లేదు. కరోనాను దేవతగా భావిస్తూ.. గుళ్లు కట్టి పూజలు చేస్తుండగా, ఏపీలో పొగబెడుతున్నారు. ఊరంతా కలియదిరుగుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో కరోనా కట్టడికి వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. వనమూలికల పొగతో కరోనా మాటాష్.. అంటూ ప్రచారం మొదలు చేపట్టారు. వనమూలికల పొగతో కరోనా కట్టడి చేయవచ్చాంటూ.. అమలాపురం గౌతమి మహర్షి గోశాల నిర్వహికులు ప్రచారం చేపట్టారు. వేపాకు, సాంబ్రాణి, ఆవుపిడక, గుగ్గిలం లాంటి 33 రకాల వనమూలికలతో పట్టణ పురవీధుల్లో తిరుగుతూ పొగను నింపుతున్నారు నిర్వాహకులు. పొగ ద్వారా క్రిములను నిర్ములించగలమంటున్నారు. వాయువు రూపంలో ఉన్న క్రిములను నాశనం చేయడం ద్వారా కొంత వరకు కరోనాను నిర్మూలించవచ్చని గోశాల నిర్వాహ‌కులు చెబుతున్నారు.  క‌రోనా క‌ట్ట‌డికి ఈ వ‌న‌మూలిక‌ల పొగ వ్య‌వ‌హారం జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

Also Read: మాంసం కోసం క్రూరం.. ప్రాణాలతో ఉన్న పాడిగేదెల తొడలు కొసిన దుర్మార్గులు..

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం.. రాగల రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..