Pawan Kalyan: అందుకే కొంచెం లేట్ అంటున్న పవన్.. మళ్లీ ఆగస్ట్ మొదటి వారంలో జనంలోకి వారాహి
వారాహి యాత్ర ద్వారా ప్రజలు, కార్యకర్తల నుంచి వస్తున్న స్పందనతో ఇదే ఊపుతో ముందుకెళ్లాలని జనసేన చీఫ్ భావించారు. అందుకే మొదటి విడత షెడ్యూల్ కు రెండో విడత యాత్రకు మధ్య కేవలం ఎనిమిది రోజులు మాత్రమే గ్యాప్ తీసుకున్నారు. కానీ మూడో విడత యాత్ర ప్రారంభానికి కొంచెం గ్యాప్ వచ్చింది. దీనికి కారణం పవన్ బిజీ షెడ్యూల్ అంటున్నాయి జనసేన వర్గాలు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మూడో విడత ఎప్పుడుంటుంది. మళ్లీ పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి ఎప్పుడు వస్తారని పార్టీ నేతలు, కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రెండు విడతలు వారాహి యాత్ర పూర్తి చేసిన పవన్ కళ్యాణ్.. పార్టీ కేడర్ లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఉమ్మడి గోదావరి జిల్లాలు టార్గెట్ గా పవన్ తన యాత్ర ప్రారంభించారు. గోదావరి జిల్లాలను వైసీపీ నుంచి విముక్తి కలిగించాలంటూ తన పర్యటన కొనసాగించారు. అందరూ ఊహించిన దానికంటే ఎక్కువగానే పవన్ జోరు కొనసాగింది. ప్రధానంగా పార్టీకి ఎక్కువ పట్టు ఉన్న గోదావరి జిల్లాలను మొదట ప్రయార్టీగా పెట్టుకోవడం పవన్ కు బాగా కలిసొచ్చింది. ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతూ యాత్రను కొనసాగించారు పవన్ కళ్యాణ్. జూన్ 14 న కత్తిపూడి నుంచి ప్రారంభమైన మొదటి విడత టూర్ అదే నెల 30న భీమవరం సభతో ముగిసింది. ఉమ్మడి జిల్లాల్లో పది నియోజకవర్గాలను పవన్ తన మొదటి పర్యటన ద్వారా కవర్ చేసారు. ఇక జూలై 9 న ఏలూరు నుంచి రెండో విడత యాత్ర ప్రారంభమై 14వ తేదీన తణుకు సభతో ముగిసింది. ఆ తర్వాత చేరికలు,ఇతర కార్యక్రమాల తో వారాహి మూడో విడత యాత్రకు కాస్త గ్యాప్ వచ్చింది.
వారాహి యాత్ర ద్వారా ప్రజలు, కార్యకర్తల నుంచి వస్తున్న స్పందనతో ఇదే ఊపుతో ముందుకెళ్లాలని జనసేన చీఫ్ భావించారు. అందుకే మొదటి విడత షెడ్యూల్ కు రెండో విడత యాత్రకు మధ్య కేవలం ఎనిమిది రోజులు మాత్రమే గ్యాప్ తీసుకున్నారు. కానీ మూడో విడత యాత్ర ప్రారంభానికి కొంచెం గ్యాప్ వచ్చింది. దీనికి కారణం పవన్ బిజీ షెడ్యూల్ అంటున్నాయి జనసేన వర్గాలు. పవన్ నటించిన బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండటం, మరో సినిమాకు డబ్బింగ్ తో పాటు షూటింగ్ షెడ్యూల్ ఉండటంతో స్వల్పంగా విరామం తప్పలేదంటున్నారు. ఆగస్ట్ మొదటి వారంలో మళ్లీ వారాహితో రెడ్డెక్కెలా పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ వీలుకాని పక్షంలో రెండో వారం ప్రారంభంలోనయినా మళ్లీ వారాహిని బయటకు తీయనున్నారు పవన్.
ఉమ్మడి గోదావరి జిల్లాల్లోనే కొనసాగనున్న మూడో విడత టూర్
మొదటి రెండు విడతలు గోదావరి జిల్లాల్లోనే వారాహి యాత్ర కొనసాగింది. రెండు ఉమ్మడి జిల్లాల్లో 34 అసెంబ్లీ సీట్లలో జనసేనను గెలిపించాలని పవన్ పదేపదే చెప్పుకుంటూ వస్తున్నారు. దీంతో మూడో విడత టూర్ కూడా ఉమ్మడి గోదావరి జిల్లాల్లోనే ఉంటుందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. రెండో విడత టూర్ మొత్తం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సాగింది. ఈసారి మూడో విడతలో రెండు గోదావరి జిల్లాల్లో ఉండేలా పవన్ షెడ్యూల్ ఉంటుందని అంటున్నారు. నిడదవోలు నుంచి యాత్ర ప్రారంభం అయ్యే అవకాశాలు కనిసిస్తున్నాయి. ఇప్పటికే ఆయా జిల్లాల నాయకులతో పార్టీ ముఖ్యనేతలు యాత్ర కు సంబంధించి రూట్ మ్యాప్ పై చర్చిస్తున్నారు. రెండు విడతల యాత్ర ద్వారా ప్రభుత్వంపై డోస్ పెంచిన పవన్ కళ్యాణ్.. మూడో విడత యాత్ర ఎలా ఉంటుందనే ఉత్కంఠ మొదలైంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..