Warangal: ఉమ్మడి వరంగల్ జిల్లాను ముంచెత్తిన వరదలు.. ఐదుగురు జలసమాధి, 13 మంది అడ్రస్ గల్లంతు..

ములుగు జిల్లా వెంకటాపురం మండలం బూరుగుపేట శివారులోని మారేడు గొండ చెరువుకు గండిపడి ఒక్కసారిగా వరదనీరు ఊరును ముంచెత్తింది. ఈ క్రమంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వరదల్లో కొట్టుకుపోయారు. వారిలో బండ్ల సారయ్య అనేవ్యక్తి మృత దేహం లభ్యమైంది. సారమ్మ రాజమ్మ అనే ఇద్దరు వరదల్లో కొట్టుకు పోయారు.

Warangal: ఉమ్మడి వరంగల్ జిల్లాను ముంచెత్తిన వరదలు.. ఐదుగురు జలసమాధి, 13 మంది అడ్రస్ గల్లంతు..
Warangal Floods
Follow us
G Peddeesh Kumar

| Edited By: Surya Kala

Updated on: Jul 28, 2023 | 6:45 AM

రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలం అవుతుంది. వాగులు ఉప్పంగి ప్రవహిస్తున్నాయి. చెరువుల నిండి మత్తడి వరదలు రహదారులపై ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ వరదల్లో చిక్కుకొని చాలామంది ప్రాణాలు కోల్పోయారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొరంచవాగు ఉప్పొంగలతో మోరంచపల్లి గ్రామాన్ని వరద ముంచత్తింది. ఈ వరదల్లో నలుగురు గల్లంతయ్యారు. మృతులు ఓదిరెడ్డి, వజ్రమ్మ, నాగరాజు, మహాలక్ష్మి గుర్తించారు. వరద ఉదృతి కాస్త తగ్గినా మృత దేహాల ఆచూకీ మాత్రం ఇంకా లభించిలేదు.

ములుగు జిల్లాలో జంపన్నవాగు మహోగ్రరూపం దాల్చింది. కొండాయి – మల్యాల గ్రామాలను ముంచెత్తింది.  ఒక్కసారిగా వాగు ఊరిపై కమ్మేయడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు పెట్టిన 20 మందిలో ఏడుగురు వరదల్లో గల్లంతయ్యారు. వారికోసం NDRF బృందాలు బోట్స్, డ్రోన్ కెమెరాలతో గాలిస్తున్నారు.  కానీ గురువారం రాత్రి వరకు వారి ఆచూకీ లభించలేదు.. గల్లంతైన వారిలో రషీద్, మజీద్ ఖాన్, తన భార్య, షరీఫ్, అజ్జు మహబూబ్ ఖాన్ ఉన్నారు. సంఘటనా స్థలానికి ములుగు MLA సీతక్క కూడా చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

ములుగు జిల్లా వెంకటాపురం మండలం బూరుగుపేట శివారులోని మారేడు గొండ చెరువుకు గండిపడి ఒక్కసారిగా వరదనీరు ఊరును ముంచెత్తింది. ఈ క్రమంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వరదల్లో కొట్టుకుపోయారు. వారిలో బండ్ల సారయ్య అనేవ్యక్తి మృత దేహం లభ్యమైంది. సారమ్మ రాజమ్మ అనే ఇద్దరు వరదల్లో కొట్టుకు పోయారు. వారికోసం గాలింపు కొనసాగుతుంది.

ఇవి కూడా చదవండి

మరోవైపు మహబూబాబాద్ జిల్లా పోచంపల్లి గ్రామానికి చెందిన శ్రీను, యాకయ్య అనే ఇద్దరు అన్నదమ్ములు ముత్తడి వరదల్లో గల్లంతయ్యారు.. శ్రీను మృతదేహం లభ్యమయింది.. యాకయ్య కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి..

హనుమకొండ జిల్లా వేలేరు మండలం కన్నారం వద్ద కొండల మహేందర్ వరదల్లో కొట్టుకుపోయి మృతి చెందాడు. బైక్ తో సహా వరదల్లో కొట్టుకుపోయిన మహేందర్ డెడ్ బాడీలో ముల్లపొదల్లో చిక్కుకొని లభ్యమయింది..

హనుమకొండ అమృత టాకీస్ సమీపంలో జరిగిన విద్యుత్ ప్రమాదంలో ప్రేమ్ సాగర్ అనేవ్యక్తి మృతి చెందాడు. ఉదయం పాల ప్యాకెట్ కోసం వెళ్ళిన ఆయన తెగిపడిన విద్యుత్ తీగలను గమనించకుండా తగలడంతో విద్యుత్ షాక్ కు గురై అక్కడికి ఇక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కుండపోత వర్షాలు, వరదలు వూహించని విధంగా ప్రాణ నష్టం మిగిల్చాయి.. మృతుల కుటుంబ సభ్యుల బోరుమంటున్నరు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..