Different Thieve: వాడో వెరైటీ దొంగ.. ఇంట్లో చొరబడతాడు.. ఇల్లంతా శుభ్రం చేసి వెళ్తాడు..!

Different Thieve: వాడో వెరైటీ.. కానీ టూ ఇంటెలిజెంట్..! ఏ పని చేసినా మూడో కంటికి తెలియదు. ఏం చేసినా సింగల్ గానే చేస్తాడు.

Different Thieve: వాడో వెరైటీ దొంగ.. ఇంట్లో చొరబడతాడు.. ఇల్లంతా శుభ్రం చేసి వెళ్తాడు..!
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 29, 2022 | 11:24 PM

Different Thieve: వాడో వెరైటీ.. కానీ టూ ఇంటెలిజెంట్..! ఏ పని చేసినా మూడో కంటికి తెలియదు. ఏం చేసినా సింగల్ గానే చేస్తాడు. ఎవరి ఇంటికి వెళ్ళినా.. పని పూర్తయ్యాక మాత్రం తిరిగి వెళ్తూ ఇల్లంతా శుభ్రంగా తడిగుడ్డ పెట్టి మరీ తూడ్చి వెళ్తాడు. వీడు ఎవడురా బాబు అనుకుంటున్నారా..!? వీడో వెరైటీ దొంగ. అనుకున్నదంతా మూటగట్టుకొని చెక్కేస్తాడు. మరి ఈ తడిగుడ్డ పెట్టే కాన్సెప్ట్ ఏంటనే గా మీ ఆలోచన..? ఒకసారి ఈ వెరైటీ ఊడ్చుడు దొంగ క్రిమినల్ కథ ఏంటో తెలుసుకుందాం పదండి..

ఒక్కో దొంగకి ఒక్కో స్టైల్ ఉంటుంది. ఏదైనా దొంగతనానికి ప్లాన్ చేయాలంటే.. ప్రత్యేకమైన స్ట్రాటజీ ఉంటుంది. కొందరు ఇద్దరేసి.. మరికొందరు ఒక గ్యాంగ్ గా.. ఇంకొందరు బ్యాచ్ లు, బ్యాచ్ లు గా విడిపోయి దొంగతనాలు చేస్తూ ఉంటారు. చోరీలు చేశాక పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఒక్కొక్కరు ఒక్కో ప్లాన్లు వేస్తారు. కొందరైతే ఈజీగానే దొరికిపోతుంటాయి. మరికొందరు మాత్రం అవసరమైతే ఫింగర్ ఫ్రింట్స్ ఆధారంగా ఎప్పటికైనా దొనిరిపోతుంటారు. అలా కాకుండా చాలామంది ఏ క్లూ కూడా దొరక్కుండా చాకచక్యంగా వ్యవహరిస్తుంటారు.

దొంగల్లో చాలామంది వెరైటీ వెరైటీ పనులు చేస్తూ ఉంటారు. కానీ మనం తెలుసుకుబోయే ఈ దొంగ పేరు మరడా సాయి అలియాస్ సొర సొర పిట్టలు. వయస్సు 22 ఏళ్ళు. పని పెయింటింగ్. ప్రవృత్తి మాత్రం సమయం దొరికినప్పుడు చేతి వాటాలు. పెదవాల్తేరు ప్రాంతానికి చెందిన ఈ మరడా సాయి అలియాస్ సొర సొర పిట్టలు.. చోర కళకు అలవాటు పడ్డాడు. ఎవరితో అయినా జాతకడితే వాటా ఇవ్వాల్సి వస్తాదేమోనని.. సింగిల్ గా చోరీలు చేయడం ప్రారంభించాడు. ఒక్కో ఇంటిని టార్గెట్ చేస్తూ ముందుకు సాగాడు. సీనియార్టీ పెరిగేకొద్దీ చోరీ కూడా సులువయింది. రెండు రోజుల పాటు ఒక్కడే రెక్కీ చేసుకోవడం.. ఆ తర్వాత తాళం వేసి ఉన్న ఇళ్లకు రాత్రిపూట స్కెచ్ వేయడం. సింగిల్‌ గానే ఎంటరై ఇంట్లో ఉన్నదంతా ఊడుచుకోవడం అలవాటుగా మారిపోయింది. ఇలా గతంలో 7 చోరీలు చేసి జైలుకు వెళ్ళాడు.

కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో జైలు నుంచి బయటకు వచ్చిన మరడా సాయి.. ఈ సారి డిఫరెంట్‌గా థింక్ చేశాడు. దొంగతనం చేయాలి.. సొత్తును ఎత్తుకెళ్లాలి.. కానీ పోలీసులకు చిక్కకూడదు. ఎలా..? ఎక్కడ ఐడియా వచ్చిందేమో గాని.. ఇక వెనుదిరిగి చూడలేదు. సరి కొత్త ఐడియాతో చెలరేగిపోయాడు. గత ఏడాది ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు ఏకంగా 11 చోరీలకు పాల్పడ్డారు. రాత్రిపూట సింగిల్ గానే ఇళ్లల్లోకి చొరబడి ఇళ్లలో ఉన్నదంతా ఎత్తుకెళ్లాడు. ఎంవిపి కాలనీ లోని ఒకే ప్రాంతంలో అన్ని చోరీ లు చేసి తప్పించుకుని తిరుగుతున్నాడు. వరుస చోరీలు జరుగుతున్న పోలీసులకు ఏమాత్రం క్లూ చిక్కడం లేదు.. దొంగ ఎవరో అంతుపట్టడం లేదు. దాదాపుగా ఏడున్నర లక్షల విలువ చేసే బంగారం వెండి నగదును మూటగట్టుకుని పారిపోయాడు ఈ మారడా సాయి.

దొంగతనం జరిగిన ఇంటికి పోలీసులు వెళ్లడం.. ఆధారాలు సేకరించడం.. కానీ దొంగ ఎవరో అందుబాటులో లేకపోవడం.. ఇదే జరుగుతుంది గత నాలుగైదు నెలలుగా. కనీసం వేలిముద్రలు గానీ పాదముద్రలు గానీ లేకుండా ఉండడంతో పోలీసులు ఖంగుతిన్నారు. క్రాస్ చెక్ చేసి చూసేసరికి.. ఇల్లంతా క్లీన్ గా తుడిచిపెట్టినట్లుగా ఉంటుంది. దీంతో వీరిపై చేసిన పోలీసులకు.. ఆసక్తికర విషయం తెలిసిందే. దొంగ ఎవరో కానీ ఇంట్లో దోచుకుని ఆ తర్వాత ఇల్లంతా తడిగుడ్డతో శుభ్రంగా తుడుస్తున్నట్టు గుర్తించిన పోలీసులు. ఇదేదో ఇల్లంతా దోచుకునేందుకు కృతజ్ఞతగా చేసింది కాదు.. తన ఆధారాలేవీ పోలీసులకు చిక్కకుండా ఈ పని చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఇక ఆ కోణంలో వెరిఫై చేయడం మొదలుపెట్టారు. అయినా క్లూ లేదు.

ఎంత కొమ్ములు తిరిగిన దొంగ అయినా పట్టుబడడం మాత్రం ఖాయం. దీంతో గతంలో ఆ ప్రాంతంలో ఉండే పాత నేరస్తుల పై కన్నేశారు పోలీసులు. మరడా సాయి గురించి ఆరా తీసేసరికి కొమ్మాది లో ఉంటున్నట్టు నిర్ధారించుకున్నారు. జైలు నుంచి బయటకు వచ్చాక పెయింటింగ్ పనులు చేసుకునే మరడా సాయిపై తొలుత పోలీసులకు అనుమానం రాలేదు. ఆ తర్వాత కదలికలపై వెరిఫై చేసే సరికి.. మనోడు మళ్ళీ ఈ చోరీలు చేస్తున్నట్లు గుర్తించారు. అది కూడా తడిగుడ్డ పెట్టే చోరీలు కూడా చేసేది ఇతనేనని నిర్ధారించుకున్నారు. పట్టుకొని విచారించే సరికి అసలు విషయాన్ని కక్కేసాడు సాయి. ఆ తడిగుడ్డ థీమ్ ను కూడా బయట పెట్టాడు. తడి గుడ్డ పెట్టడమే కాదు.. చోరీలకు డిఫరెంట్ గా వులన్ గ్లౌవ్స్ వినియోగిస్తున్నట్టు కూడా చెప్పాడు. ఎట్టకేలకు సాయి అలియాస్ సొర సొర పిట్ట ను అరెస్టు చేసిన పోలీసులు.. అతను నుంచి ఇరవై మూడున్నర తులాల బంగారం, 30 తులాల వెండి ని స్వాధీనం చేసుకున్నామని అంటున్నారు ఇన్ చార్జ్ క్రైమ్ డీసీపీ శ్రవణ్ కుమార్.

గతంలో ఏడు చోరీలు.. జైలుకెళ్ళి వచ్చాక మళ్ళీ 11 చోరీలు.. చోరీలు చేసే కొద్దీ డిఫరెంట్ స్టైల్.. ఇప్పటికే సస్పెక్ట్ షీట్ ఉన్న సాయి అలియాస్ సొర సొర పిట్ట ను ఓ పట్టుబట్టాలని పోలీసులు నిర్ణయించుకున్నారు. ఉన్నతాధికారుల సూచనలతో డిసి షీట్ ఓపెన్ చేయాలని చూస్తున్నారు పోలీసులు. ఇదీ ఈ వెరైటీ ఊడ్చుడు దొంగ క్రిమినల్ కథ.

ఖాజా, టీవీ9 రిపోర్టర్, వైజాగ్.

Also read:

Hyderabad: ‘నగరాన్ని డ్రగ్‌ ఫ్రీ జోన్‌గా మారుద్దాం’.. ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలకు మాదాపూర్ డీసీపీ సూచన.

Cheating: పెళ్లి పేరుతో ఘరానా మోసం.. ముక్కూ , మొఖం తెలియకుండానే 17 లక్షలు కొట్టేసిన వైనం..

Real Estate Murder: సంగారెడ్డిలో దారుణం.. రియల్టర్‌ దారుణ హత్య.. తల, మొండెం వేరు చేసిన దుండగులు..!