AP News: ఈ జిల్లాలో టీడీపీ అభ్యర్థులకు అసమ్మతి సెగ.. ప్రచారం చేసుకోలేని స్థితిలో నేతలు..

ఉమ్మడి కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అభ్యర్థులకు అసంతృప్తి నేతల నుంచి ఇబ్బందులు తప్పడం లేదు. చాలా నియోజకవర్గాలలో ఇదే పరిస్థితి నెలకొంది.

AP News: ఈ జిల్లాలో టీడీపీ అభ్యర్థులకు అసమ్మతి సెగ.. ప్రచారం చేసుకోలేని స్థితిలో నేతలు..
TDP
Follow us

| Edited By: Srikar T

Updated on: Apr 04, 2024 | 6:28 PM

ఉమ్మడి కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అభ్యర్థులకు అసంతృప్తి నేతల నుంచి ఇబ్బందులు తప్పడం లేదు. చాలా నియోజకవర్గాలలో ఇదే పరిస్థితి నెలకొంది.

కోడుమూరు..

కోడుమూరు టిడిపి అభ్యర్థిగా బొగ్గుల దస్తగిరిని పార్టీ ప్రకటించింది అయితే అప్పటివరకు ఇన్చార్జిగా పనిచేసిన గూడూరు ప్రభాకర్ ఆత్మహత్యాయత్నం చేశారు. దస్తగిరి టిడిపి నేత విష్ణువర్ధన్ రెడ్డి వర్గానికి.. కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి కి అస్సలు గిట్టదు. దస్తగిరి విష్ణువర్ధన్ రెడ్డికి పార్టీ టికెట్ కేటాయించడంతో కోట్ల వర్గం పూర్తిగా దూరంగా ఉంది. మద్దతు ఇచ్చే ప్రసక్తేలేదని తెలిసి చెప్పింది. అవసరమైతే గూడూరు ప్రభాకర్ రెబేల్‎గా పోటీ చేస్తారని ప్రచారం చేస్తుంది.

ఎమ్మిగనూరు..

ఎమ్మిగనూరులో కూడా టిడిపి అభ్యర్థి జయ నాగేశ్వర్ రెడ్డికి విభేదాలు తప్పడం లేదు టికెట్ ఆశించి భంగపడిన డాక్టర్ సోమనాథ్ లోలోపల మండిపడుతున్నారు. కూటమిలో భాగస్వామ్య పార్టీలుగా ఉన్న బిజెపి, జనసేన ఇన్చార్జిలు కూడా దూరంగా ఉన్నారు. రెండు పార్టీల నుంచి చంద్రబాబు బహిరంగ సభకు కూడా హాజరుకాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జయ నాగేశ్వర్ రెడ్డి వ్యతిరేకులకు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వర్గం వ్యతిరేకంగా పనిచేయవచ్చని ప్రచారం జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

మంత్రాలయం..

మంత్రాలయంలో పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. రాఘవేంద్ర రెడ్డిని టిడిపి అభ్యర్థిగా ఆ పార్టీ ప్రకటించింది. అప్పటినుంచి ఇప్పటివరకు రాఘవేంద్ర కనీసం ప్రచారం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. పెద్దగా ప్రచారం చేసిన సందర్భాలు కూడా లేవు. అదే సమయంలో ఇన్చార్జిగా ఉంటూ టిక్కెట్ దక్కని తిక్కారెడ్డి ప్రతిరోజు నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. రెబెల్‎గా పోటీ చేస్తానని హెచ్చరిస్తున్నారు. నియోజకవర్గంలోని టిడిపి క్యాడర్ మొత్తం తిక్కారెడ్డి వైపే ఉంది. ఏకంగా తీర్మానం చేసి పార్టీ అధిష్టానానికి పంపింది. అధిష్టానం పిలిచినా కూడా తిక్కారెడ్డి వెళ్లలేదు. దీంతో టీడీపీ నుంచి కోఆర్డినేటర్ బీద రవిచంద్ర యాదవ్, ఎంపీ సంజీవ్ కుమార్ బిటి నాయుడు తదితర నేతలు స్వయంగా మంత్రాలయం వెళ్లారు. పార్టీ ఆఫీసులో కూర్చుని వివరాల సేకరించారు. ఫీడ్ బ్యాక్ తీసుకున్న తర్వాత అభ్యర్థి మార్పు ఖాయమని తేలిపోయింది. దీంతో తిక్క రెడ్డి వర్గీయులు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది.

ఆదోని..

ఆదోని అసెంబ్లీ సీటు పొత్తులో భాగంగా బిజెపికి కేటాయించారు. డాక్టర్ పార్థసారధి ఆ పార్టీ అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్నారు. అంతవరకు టిడిపి ఇన్చార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, టికెట్ ఆశించిన మధిర భాస్కర్ రెడ్డి తదితరు నేతలు కూడా ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ పంపించిన నేతలు మీనాక్షి నాయుడు ఇంటికి వెళ్ళగా అభ్యర్థుల ప్రకటన వెనుక పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని మీనాక్షి నాయుడు అనుచరులు, టిడిపి కార్యకర్తలు మొహం మీదనే ఆరోపణలు చేశారు.

ఆలూరు..

ఆలూరు అసెంబ్లీ టికెట్ మాజీ ఇంచార్జ్ వీరభద్ర గౌడ్‎కి కేటాయించారు. మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాత వైకుంఠం శివప్రసాద్ వైకుంఠ మల్లికార్జున టికెట్లు ఆశించి భంగపడ్డారు. దీంతో వీరభద్ర గౌడ్‎కి సహకరించలేదని బహిరంగంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వీరభద్ర గౌడ్‎కి టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఎవరూ కూడా మద్దతు ప్రకటించకపోవడం ఎందుకు నిదర్శనంగా భావిస్తున్నారు.

నంద్యాల..

ఇక నంద్యాలలో కూడా అసమ్మతి జడలు విప్పుతోంది. మాజీ మంత్రి ఫరూక్‎కి నంద్యాల అసెంబ్లీ సీటు కేటాయించారు. అప్పటివరకు ఇన్చార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి భగ్గుమన్నారు. అప్పటికే కొందరు అనుచరులు రాజీనామా కూడా చేశారు. నారా లోకేష్ పిలిపించుకుని ఇద్దరికీ రాజీకుదిర్చారు. అయినా ఇద్దరి మధ్య ఎక్కడ సఖ్యత కనిపించడం లేదు. ఎడ మొహం పెడ మొహంగానే కనిపిస్తున్నారు.

నందికొట్కూరు..

ఇక నందికొట్కూరులో కూడా పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. పార్లమెంట్ అభ్యర్థి శబరి నియోజకవర్గంలో ప్రచారం చేస్తే అసెంబ్లీ అభ్యర్థి జయ సూర్య పాల్గొనడం లేదు. జై సూర్య పార్లమెంట్ అభ్యర్థిని కూడా పిలవడం లేదు. టిడిపి నేత మాజీ ఐపీఎస్ శివానందరెడ్డి దగ్గర పని చేసే జయ సూర్య‎కి టికెట్ రావడంతో ఇతర టిడిపి నేతలలో కొంత వ్యతిరేకత వ్యక్తం అయింది. దీంతో అక్కడ జయ సూర్యని మారుస్తారని ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది.

శ్రీశైలం..

శ్రీశైలం నియోజకవర్గం అభ్యర్థిగా బుడ్డ రాజశేఖర్ రెడ్డిని పార్టీ ప్రకటించింది. అప్పటినుంచి మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, స్థానిక మైనారిటీ నేత మహమ్మద్ హుస్సేన్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. అహ్మద్ హుస్సేన్ ఏకంగా టిడిపికి రాజీనామా చేసి వైసీపీలో చేరిపోయారు. బుడ్డ రాజశేఖర్ రెడ్డి మాత్రం నియోజకవర్గంలో అందరినీ కలుపుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్