AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: మరో గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్.. లారీ డ్రైవర్లతో కీలక భేటీ!

మాజీ సీఎం చంద్రబాబు వృద్ధుల సంక్షేమాన్ని విస్మరించారని, ఆయన వల్లనే పింఛన్ల కోసం ఎండలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. తిరుపతి జిల్లా చినసింగమలలో లారీ, ఆటో డ్రైవర్లతో ముఖాముఖి సందర్భంగా సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

CM Jagan: మరో గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్.. లారీ డ్రైవర్లతో కీలక భేటీ!
Cm Jagan
Balu Jajala
|

Updated on: Apr 04, 2024 | 6:02 PM

Share

మాజీ సీఎం చంద్రబాబు వృద్ధుల సంక్షేమాన్ని విస్మరించారని, ఆయన వల్లనే పింఛన్ల కోసం ఎండలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. తిరుపతి జిల్లా చినసింగమలలో లారీ, ఆటో డ్రైవర్లతో ముఖాముఖి సందర్భంగా సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. టిప్పర్ డ్రైవర్ కు ఎమ్మెల్యే సీటు ఇచ్చినందుకు చంద్రబాబు తనను ఎగతాళి చేసిన సంఘటనను సీఎం జగన్ ప్రస్తావించారు. టిప్పర్ డ్రైవర్ ను ఎమ్మెల్యేగా నామినేట్ చేయడంలో తప్పేమీ లేదని, టీడీపీ విమర్శలు నిరాధారమని సీఎం జగన్ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.

చంద్రబాబు హయాంలో ఉద్యోగావకాశాలు లేకపోవడంతో టిప్పర్ డ్రైవర్ గా పనిచేస్తున్న (ఎంఏ చేసిన) వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులు పట్టుదల, ధైర్యసాహసాలను సీఎం జగన్ కొనియాడారు. టీడీపీ పార్టీ కేవలం ధనువంతులు, వ్యాపారులకే టికెట్ ఇస్తుందని ఈ సందర్భంగా జగన్ అన్నారు. వాహన మిత్ర పథకం ద్వారా ఆటో, ట్యాక్సీ, టిప్పర్ డ్రైవర్లకు ఏడాదికి రూ.10,000 ఆర్థిక సహాయం చేస్తూ, 5 ఏళ్లలో 50 వేలు అందిస్తున్నామని సీఎం జగన్ పునరుద్ఘాటించారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు రూ.1296 కోట్లు డ్రైవర్లకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డ్రైవర్ల సమస్యలను విన్న సీఎం జగన్ భవిష్యత్తులో వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి